English | Telugu

విక్టరీ వెంకటేష్ ఇంటర్ వ్యూ

"కలియుగపాండవులు" చిత్రంతో సినీ తెరంగేట్రం చేసి, అర్థశతానికి పైగా చిత్రాల్లో నటించి, రాశి కన్నా వాసి మిన్న అని నమ్మిన హీరోగా, నటించిన ప్రతి చిత్రాన్నీ తొలి చిత్రమన్నంత జాగ్రత్తగా నటించబట్టే, డి.వెంకటేష్ కాస్తా "విక్టరీ" వెంకటేష్ అయ్యారు. ఆయనకు మహిళా అభిమానులు ఎక్కువంటే అతిశయోక్తి కాదు.

అందుకేనేమో ఆయన సినిమాలకు "మల్లీశ్వరి, తులసి, లక్ష్మి" ఇలా ఆడవాళ్ళ పేర్లను ఎక్కువగా పెడుతూంటారు. అలాంటి వెంకటేష్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో, బెల్లంకొండ సురేష్ నిర్మించిన విభిన్నకథా చిత్రం "బాడీగార్డ్". ఈ "బాడీగార్డ్" చిత్రం జనవరి 14 వ తేదీన, సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతూంది. ఈ సందర్భంగా హీరో వెంకటేష్ తెలుగువన్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్ వ్యూ మీ కోసం.

1) తెలుగువన్ - నమస్తే వెంకటేష్ గారూ...!

వెంకటేష్ - నమస్తే...!

2) తెలుగువన్ - మీ "బాడీగార్డ్" చిత్రం జనవరి 14 వ తేదీన విడుదల కాబోతూంది. ఆ చిత్రం గురించి మా ప్రేక్షకులకు తెలియజేస్తారా...? వెంకటేష్ - ఈ "బాడీగార్డ్"సినిమా గురించి చెప్పే ముందు మీకు మరో విషయం చెప్పాలి. ఈ సినిమా మళయాళంలో నేను ముందు చూశాను. ఈ సినిమాలో ముందుగా నేనే నటించాల్సింది. కానీ అప్పుడు కుదరలేదు. ఈలోగా తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఇప్పుడు బెల్లంకొండ సురేష్ నన్ను హీరోగా పెట్టి తీస్తాననటంతో నటించాను.

3) తెలుగువన్ - ఈ సినిమా ప్రత్యేకతలేంటి...?

వెంకటేష్ - ఈ "బాడీగార్డ్" సినిమాలో నేను, త్రిష కలసి నటిస్తున్నాం. మా కాంబినేషన్ లో వచ్చిన "ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, నమో వెంకటేశా" వంటి రెండు సినిమాలూ మంచి హిట్టయ్యాయి. ఇది మా కాంబినేషన్ లో వస్తున్న హేట్రిక్ మూవీ. అలగే "డాన్ శీను" ఫేం మలినేని గోపీచంద్ దర్శకత్వం కూడా బాగుంది. ఓవరాల్ గా ఈ పిక్చర్ ప్రేక్షకులకు ఒక విందుభోజనం వంటిది.

4) తెలుగువన్ - ఈ సినిమా నాలుగు భాషల్లో ఇప్పటికే వచ్చింది. మరి మీరు కొత్తగా ఈ సినిమాలో ఏం చూపించబోతున్నారు....? వెంకటేష్ - మీరు గమనిస్తే గతంలో నేను చాలా రీమేక్ సినిమాల్లో నటించాను. అవి తెలుగులో కూడా పెద్ద హిట్టయ్యాయి. అలాగే ఈ "బాడీగార్డ్" సినిమా ఇంతకు ముందు ఎన్ని భాషల్లో వచ్చినా, తెలుగులో మాత్రం నా స్టైల్లోనే ఉంటుంది. ఆ ఫ్రెష్ నెస్ ప్రేక్షకులు ఫీలవుతారు.

5) తెలుగువన్ - తమన్ ఈ "బాడీగార్డ్" చిత్రానికి అందించిన సంగీతం ఎలా ఉంది...?

వెంకటేష్ - తమన్ ఈ సినిమాకి చక్కని సంగీతాన్నందించాడు. నా బర్త్ డేకి ఈ చిత్రం ఆడియో మార్కెట్లోకి విడుదలయ్యింది. ఆడియో కూడా పెద్ద హిట్టయ్యింది. సంగీతం అందరికీ బాగా నచ్చింది. అలాగే రీ-రికార్డింగ్ కూడా బాగా ఇచ్చాడు.

6) తెలుగువన్ - మీ ప్రతి చిత్రంలో మీ మార్కు కామెడీ కచ్చితంగా ఉంటుంది. మరి ఈ చిత్రంలో మీ కామెడీ ఎలా ఉండబోతోంది...? వెంకటేష్ - యా...డెఫినెట్ గా నా మార్కు కామెడీ ఈ చిత్రంలో ఉంటుంది. ఒకటి రెండు సీన్లలో నేను చేసే కామెడీ ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది.

7) తెలుగువన్ - ఈ "బాడీగార్డ్" సినిమాలో మీరు మాస్ కి నచ్చే డైలాగులు బాగా చెప్పారని వినపడుతుంది.

వెంకటేష్ - బాగా అంటే కాదుగానీ...ఒకటి రెండు చోట్ల మాస్ డైలాగులు వినిపిస్తాయి. మాస్ ని కూడా గమనించాలి కదా...!

8) తెలుగువన్ - మీరు "స్వామి వివేకానంద" చిత్రంలో నటిస్తున్నారట...! కాషాయం కట్టుకున్న స్వామీజీ చరిత్ర సినిమాగా తీస్తే, దాన్లో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్సవుతాయి కదా...!

వెంకటేష్ - ఈ రోజు వివేకానంద జయంతి. దీన్ని "యూత్ డే" డిక్లేర్ చేశారు. ఆయన ఒక్కోమాట ఒక్కో డైనమైట్. ఆయన మాటలు బాగా ఇన్ స్పైరింగ్ గా ఉంటాయి. ఈ సినిమా చూసిన తర్వాత మీరు కమర్షియల్ ఎలిమెంట్స్ గురించి ఆలోచించరు. ఆ సినిమా గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు చర్య అవుతుంది.

9) తెలుగువన్ - మహేష్ బాబు "బిజినెస్ మ్యాన్" కూడా మీ సినిమాతోనే విడుదలవుతుంది. మీ ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతోంది....?

వెంకటేష్ - ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను ఎవరికీ పోటీ అనుకోను...అలాగే ఎవరూ నాకు పోటీ అని కూడా అనుకోను. సినిమా బాగుంటే జనం చూస్తారు. లేదంటే వెనక్కి పంపిస్తారు. అయితే ఒక హీరోగా నా వరకూ నేను నిజాయితీగా నటించటానికి ప్రయత్నిస్తాను. అన్నట్టు నేను, మహేష్ బాబు కలసి ఒక సినిమాలో నటిస్తున్నాం.

10) తెలుగువన్ - మీ "బాడీ గార్డ్" అనే సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందా...?

వెంకటేష్ - నేను ఎప్పుడూ రికార్డులు వంటివి పట్టించుకోను...!

11) తెలుగువన్ - ఇంతసేపూ మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి, మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు మీకు మా కృతజ్ఞతలు వెంకటేష్ గారూ.

వెంకటేష్ - ఇట్స్ మై ప్లెజర్...! మీ క్కూడా నా థ్యాంక్స్..! మీ తెలుగువన్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు....! పైరసీని ప్రోత్సహించకండి. థియేటర్లలోనే మా "బాడీ గార్డ్" సినిమా చూడండి. బై...!

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.