Read more!

English | Telugu

మాస్ రాజా రవితేజ వీర మే లో రిలీజ్

 

మాస్ రాజా రవితేజ "వీర" చిత్రం మే నెలలో రిలీజ్ కానుందని ఫిలిం నగర్ వర్గాల కథనం. వివరాల్లోకి వెళితే మాస్ మహరాజాగా పేరొందిన సెన్సేషనల్ హీరో రవితేజ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, "రైడ్" ఫేం రమేష్ వర్మ దర్శకత్వంలో, గణేష్ ఇంటూరి నిర్మిస్తున్న చిత్రం"వీర". ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతూంది. హీరో రవితేజ, హీరోయిన్ తాప్సి, విలన్ ప్రదీప్ రావత్ లపై ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్ ల నేతృత్వంలో కొన్ని సీన్లను చిత్రీకరిస్తున్నారు.

 

ఈ షెడ్యూల్ పూర్తయితే ఈ చిత్రంలోని మూడు పాటలు తప్ప సినిమా షుటింగ్ అంతా పూర్తయినట్లేనని ఈ చిత్రం యూనిట్ మీడియాకు తెలియజేస్తోంది. ఈ మాస్ రాజా రవితేజ "వీర" చిత్రానికి తమన్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మాస్ రాజా రవితేజ "వీర" చిత్రం యొక్క ఆదియోని మే నెల మొదటి వారంలో విడుదల చేసి, ఈ మాస్ రాజా రవితేజ "వీర" చిత్రాన్ని మే నెలాఖరుకల్లా విడుదల చేయాలని ఈ చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తోంది.