English | Telugu

యాక్షన్‌ నుంచి లవ్‌ స్టోరీకి.. రూటు మార్చిన వరుణ్‌తేజ్‌!

ఇప్పటివరకు 14 సినిమాల్లో హీరోగా నటించిన వరుణ్‌తేజ్‌కి పట్టుమని 5 హిట్స్‌ కూడా లేవు. అందులోనూ ఈమధ్యకాలంలో గాండీవధారి అర్జున, ఆపరేషన్‌ వాలెంటైన్‌, మట్కా వంటి సినిమాలు ఘోర పరాజయాల్ని చవిచూశాయి. దీంతో సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు వరుణ్‌. ప్రేక్షకులు మెచ్చే సినిమాలు చెయ్యాలని డిసైడ్‌ అయ్యారు. అందుకే కొత్తదనం ఉన్న సబ్జెక్ట్‌లనే ఓకే చేస్తున్నాడు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కొరియన్‌ కనకరాజు’ అనే డిఫరెంట్‌ మూవీ చేస్తున్నారు. యాక్షన్‌తోపాటు కామెడీ కూడా ఉండే ఈ సినిమా డెఫినెట్‌గా వరుణ్‌కి మంచి సినిమా అవుతుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాలో వరుణ్‌ గెటప్‌ కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

ఇప్పటికే 80 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘కొరియన్‌ కనకరాజు’ చిత్రం నవంబర్‌ చివరి వారంలో పూర్తవుతుంది. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే మరో కొత్త సినిమాని స్టార్ట్‌ చేయబోతున్నారు వరుణ్‌. విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో ఓ సినిమా గతంలోనే ఫైనల్‌ అయింది. ఏడాది తర్వాత ఈ సినిమాను మళ్లీ లైన్‌లోకి తెచ్చారు. గత ఏడాది విక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా ఓకే అనుకున్నప్పటికీ స్క్రిప్ట్‌ పక్కాగా రెడీ అవ్వకపోవడం, షెడ్యూల్స్‌ విషయంలో క్లారిటీ లేని కారణంగా కొన్నాళ్లు ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టారు. ఇప్పుడు అన్ని విషయాల్లోనూ క్లారిటీ రావడంతో డిసెంబర్‌ నుంచి షూటింగ్‌ మొదలు పెట్టాలని డిసైడ్‌ అయ్యారట. ఈమధ్యకాలంలో వరుణ్‌ చేయని రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.

విభిన్నమైన ప్రేమకథతో రూపొందనున్న ఈ సినిమా యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటుందని, అలాగే సినిమాలో ఆడియన్స్‌ని భావోద్వేగానికి గురిచేసే ఎమోషనల్‌ సీన్స్‌ కూడా ఉన్నాయని తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాను రెగ్యులర్‌ లవ్‌స్టోరీలా కాకుండా డిఫరెంట్‌గా ప్రజెంట్‌ చెయ్యబోతున్నారని సమాచారం. ఈ సినిమా తప్పకుండా వరుణ్‌ని మళ్ళీ హిట్‌ ట్రాక్‌లోకి తెస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ ప్రేమకథకు అనువైన హీరోయిన్‌ కోసం అన్వేషిస్తున్నారు. అలాగే మిగిలిన నటీనటులకు సంబంధించిన వివరాలను కూడా త్వరలోనే తెలియజేస్తారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.