English | Telugu

ఎన్టీఆర్‌ న్యూ లుక్‌పై పెరిగిన ట్రోలింగ్‌.. తిప్పికొడుతున్న ఫ్యాన్స్‌!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ క్రేజ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌కి ముందు, ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత అన్నట్టుగా పెరిగిపోయింది. రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరోకైనా ఫ్లాప్‌ కన్‌ఫర్మ్‌ అనే సెంటిమెంట్‌ని దేవరతో బ్రేక్‌ చేశారు ఎన్టీఆర్‌. ఇప్పుడు ఎన్టీఆర్‌ ప్రపంచస్థాయి హీరోగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇటీవల వార్‌2తో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్‌కు చుక్కెదురైంది. ఈ సినిమా బాలీవుడ్‌లోనూ, టాలీవుడ్‌లోనూ ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. అయినప్పటికీ ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.


కెజిఎఫ్‌ సిరీస్‌, సలార్‌ వంటి భారీ విజయాలతో దూసుకుపోతున్న ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఎన్టీఆర్‌ ఓ పాన్‌ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి డ్రాగన్‌ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారని చెప్పుకుంటున్నారు. అయితే ఇది అనఫీషియల్‌ న్యూస్‌ మాత్రమే. ఈ సినిమా కోసం తన లుక్‌ని పూర్తిగా మార్చుకుంటున్నారు ఎన్టీఆర్‌. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫిజికల్‌ ట్రైనింగ్‌ స్టిల్స్‌ బయటికి వచ్చాయి.


ఇదిలా ఉంటే.. మలబార్‌ గోల్డ్‌ సంస్థకు ఎన్టీఆర్‌ చేసిన కొత్త యాడ్‌లో ఎన్టీఆర్‌ లుక్‌పై రకరకాల కామెంట్స్‌ వస్తున్నాయి. చాలాకాలంగా ఈ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న ఎన్టీఆర్‌ గతంలో దీని కోసం చాలా యాడ్స్‌ చేశారు. అయితే ఇంతకుముందు యాడ్స్‌లో ఎన్టీఆర్‌ లుక్‌కి, తాజాగా వచ్చిన యాడ్‌లో ఎన్టీఆర్‌ లుక్‌కి చాలా తేడా కనిపించింది. అంతకుముందు ఎనర్జిటిక్‌గా కనిపించిన ఆయన.. కొత్త యాడ్‌లో ఆ స్థాయి ఎనర్జీ కనిపించకపోవడం, గడ్డం తీరులో కూడా ఎంతో మార్పు ఉండడమే ట్రోలింగ్‌కి కారణమవుతోంది. దీంతో నెటిజన్లు ఎన్టీఆర్‌ లుక్‌పై కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ లుక్‌ ఎన్టీఆర్‌కి సెట్‌ అవ్వలేదని, హెయిర్‌ స్టైల్‌ కూడా బాగాలేదని కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌ అంతకంతకు పెరిగిపోతుండడంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ రంగంలోకి దిగి వాటిని తిప్పికొడుతున్నారు.


పెద్ద హీరోలెవరైనా తాము చేసే పాత్రల కోసం రకరకాల లుక్స్‌ ట్రై చెయ్యడం సహజమేనని, దాన్ని తప్పుగా చూడడం కరెక్ట్‌ కాదని అంటున్నారు. సినిమాలోని లుక్‌ కంటే ఆ పాత్రను ఎంత సమర్థవంతంగా పోషించాడు అనేది ముఖ్యమని ఫ్యాన్స్‌ సమాధానమిస్తున్నారు. సినిమా పరంగా కాకుండా, ఒక యాడ్‌లో ఎన్టీఆర్‌ లుక్‌కి ఈ స్థాయిలో చర్చ జరగడం అనేది ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్‌కి నిదర్శమని అర్థమవుతోంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.