Read more!

English | Telugu

ఓటిటి సినీ ప్రేమికులు ఈ వీకెండ్ మీదే.. లిస్ట్ మీ ముందు 

దేనోడు దానికే ఉన్నాడనే సామెత ఒకటి ఎప్పటినుంచో ఉంది.అందుకు సినిమా రంగం మినహాయింపు ఏం కాదు. ఒక కొత్త సినిమా థియేటర్స్ లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాళ్ళు ఉన్నట్టే ఓటిటి లోకి కొత్త సినిమాలు ఎప్పుడు  వస్తాయా అని ఎదురుచూసేవాళ్ళు  కూడా ఉంటారు. ఇప్పడు అలా ఎదురుచూసే సినీ ప్రేమికులకి ఈ వీకెండ్  స్వర్గధామం గా మారనుంది. 

ఓటిటి వేదికగా ఈ వారం మూడు సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. పైగా ఆ మూడు  డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడుకున్నవే. అవి ప్రేమలు, ఓం భీం బుష్, గామి. ఆహా లో  ప్రేమలు స్ట్రీమింగ్ అవుతుండగా ప్రైమ్ వీడియోలో ఓంభీంబుష్,  జీ 5 లో గామి  ఉన్నాయి.ఒక రకంగా ఆ మూడు సినిమాలు  ఒకేసారి ఓటిటి లో ఉండటం ప్రేక్షకుల అదృష్టం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ మూడు  సూపర్ హిట్ చిత్రాలే. థియేటర్స్ లో  మంచి ప్రేక్షకాదరణ పొందాయి. అలాగే ఆయా నటుల కెరీర్లో రికార్డు కలెక్షన్స్ ని కూడా సాధించాయి.

ప్రేమలు లో నటించింది పేరు కి మలయాళ నటులే అయినా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. మూవీ కూడా చాలా  బాగుంటుంది. ఇక గామి లో విశ్వక్ సేన్ నట విశ్వరూపాన్ని చూడవచ్చు.ఎవరు ఊహించని విధంగా ఆయన క్యారక్టరైజేషన్ ఉంటుంది. మంచు కొండల్లో ఎక్కువ భాగం  షూటింగ్ ని జరుపుకుంది. ఇక ఓంభీంబుష్ లో శ్రీ విష్ణు, ప్రియదర్శిని, రాహుల్ రామ కృష్ణ తదితరులు నటించారు.మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. ముగ్గురు పోటీపడి మరి కామెడీ ని పండించారు. సో ఈ వీకెండ్ ని ఫుల్ గా సెలబ్రేట్ చేసుకోండి.