English | Telugu

నిర్మాతపై భారం ఎందుకు...?

ఆ మధ్య ఫెడరేషన్ సమ్మెకు దిగినప్పుడు తెలుగు సినీ పరిశ్రమ స్తంభించి పోయిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు తెలుగు సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్టులు తమ తమ వేతనాలను సవరించాలని కోరాయి.వారు పెంచమన్న విధంగా జీతాలు పెంచితే ఒక్కో సినిమాకు నిర్మాత మీద 50 లక్షల రూపాయల నుండి కోటి రూపాయల వరకూ భారం పడనుంది. ఈ భారాన్ని తట్టుకోవటం తమ వల్ల కాదంటూ, తమపై ఈ అనవసర భారం ఎందుకనీ, సుమారు 800 మంది నిర్మాతలు తమ సినిమాలకు బయటనుండి వర్కర్లను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారు. ఫెడరేషన్ పెంచమని అడిగిన జీతాలు ఈ విధంగా ఉన్నాయి.

క్యాటగిరీ - రోజుకి గతంలో జీతం - ఇప్పుడు అడుగుతున్న జీతం

లైట్ మేన్ - రూ. 375/ --- రూ. 1000/

డ్రైవర్ - రూ. 375/ --- రూ. 1000/

స్పాట్ బోయ్ -రూ.275 ---- రూ.900/

జూనియర్ ఆర్టిస్ట్- రూ.300/ ---- రూ.900/

వాక్యూమ్ ఆపరేటర్-రూ.375/ ---- రూ.1,000/

ఎ గ్రేడ్ డ్యాన్సర్స్ - రూ.10,000/ ---- రూ.20,000/

అసిస్టెట్స్-- డబ్బింగ్,ఎడిటింగ్,రికార్డింగ్ -రూ.250/ ---- రూ.750/

సౌండ్ ఇంజనీర్లు - రూ.1,400/ ---- రూ.3,000/

పైన రాసిన జీతాలు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. ఇలా పెరగటం వల్ల తమ సినిమా బడ్జెట్ కోటి రూపాయల వరకూ పెరుగుతుంది కనుక తాము ఈ పెరిగిన జీతాలను చెల్లించలేమనీ, అందుకని బయట నుండి వర్కర్లను తెచ్చుకుని సినిమాలు తీయటానికి నిశ్చయించుకున్నామనీ తెలుగు సినీ నిర్మాతలు అన్నారు. మరి దీనికి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.