English | Telugu

మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసిన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీ

ఇటీవల నూతనంగా ఎన్నికైన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ మెగాస్టార్ చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అందిస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్పాలసీతోపాటు పలు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గారికి టీఎఫ్ జేఏ కమిటీ మెంబర్స్ వివరించారు. భవిష్యత్ లో హౌసింగ్ సొసైటీ, క్లబ్ హౌస్ వంటివి ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చిరంజీవి గారికి తెలిపారు. ప్రస్తుత సంక్షేమ కార్యక్రమాలనుకొనసాగించడంతో పాటు సభ్యుల ఉన్నతికి కృషి చేస్తామని చిరంజీవి గారికి వివరించారు.

సినిమా జర్నలిస్టుల సంక్షేమం కోసం టీఎఫ్ జేఏ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రశంసించారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కి ఎప్పుడూ తనవంతు సహాయ సహకారాలు ఉంటాయని మెగాస్టార్ చిరంజీవి గారు అభయం ఇచ్చారు. మెగాస్టార్ ను కలిసిన వారిలో టీఎఫ్‌జేఏ అధ్యక్షుడు వైజే రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, కోశాధికారి సురేంద్ర కుమార్ నాయుడు, ఇతర కమిటీ మెంబర్స్ ఉన్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం