English | Telugu
మానాన్నే నా రోల్ మోడల్ - రానా
Updated : Jun 19, 2011
"మా నాన్నే నా రోల్ మోడల్ " అని అంటున్నాడు యువ హీరో రానా. వరల్డ్ ఫాదర్స్ డే సందర్భంగా మాట్లాడుతూ యువ హీరో రానా "నాకు రోల్ మోడల్ మా నాన్నే. మా ఇల్లు ఒక ఫిలిం స్కూల్ వంటిది. నేనందులో ఒక విద్యార్థిని మాత్రమే. మా నాన్న నా జీవితంలోనే కాదు మా కుటుంబంలో కూడా చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆయన నాకొక గైడ్ లా అనుక్షణం నాకు దిశా నిర్దేశం చేస్తుంటారు.
ఆయన తన సినీ జీవితాన్ని, తన కుటుంబ జీవితాన్నీ చాలా బ్యాలెన్స్ డ్ గా నడిపించే తీరు మాకు ఆదర్శవంతంగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆయన నాకు ఒక మెంటర్ వంటి వారు...ఇంకా చెప్పాలంటే ఆయన నా సినిమాల గురించీ, నా నటన గురించీ నిర్మొహమాటంగా విమర్శించే చక్కని క్రిటిక్ కూడా. ఆయన కుమారుడిగా పుట్టటం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని అన్నారు.