Read more!

English | Telugu

స్టార్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న తేజ సజ్జ.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న 'మిరాయ్' గ్లింప్స్!

ఈ ఏడాది 'హనుమాన్'తో సంచలన విజయాన్ని అందుకొని పాన్ ఇండియా హీరోగా అవతరించిన తేజ సజ్జ.. ఇటీవల తన కొత్త సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'ఈగల్' ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ఈ సినిమాకి 'మిరాయ్' అనే టైటిల్ పెట్టారు. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్.

'హనుమాన్' తర్వాత తేజ సజ్జ ఎలాంటి సినిమా చేస్తాడా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఈ కుర్ర హీరో బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడని చెప్పవచ్చు. 'మిరాయ్' సినిమా 'హనుమాన్'ని మించి ఉండబోతుందని గ్లింప్స్ తోనే క్లారిటీ ఇచ్చేశాడు. 'మిరాయ్' కథాంశం, ఆ భారీతనం ఆకట్టుకుంటున్నాయి. 

"అనగనగా ఒక సామ్రాట్. సామ్రాట్ అశోక్. చరిత్రలో మరకగా మిగిలిన అతని కళింగ యుద్ధం. ఆ పశ్చాత్తాపంలో వెలుగు చూసిన ఓ దేవ రహస్యం. అదే మనిషిని దైవం చేసే తొమ్మిది గ్రంథాల అపార జ్ఞానం. తరాలుగా వాటిని కాపాడుతూ తొమ్మిది మంది యోధుల నియామకం. అలాంటి జ్ఞానానికి చేరువవుతున్న ఒక గ్రహణం. ఆ గ్రహణాన్ని ఆపే జననం. తరతరాలుగా తప్పని మహా రణం" అంటూ రూపొందించిన గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. కాన్సెప్ట్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూస్తుంటే.. తేజ సజ్జ మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో సౌండ్ చేసేలా ఉన్నాడు. 

కాగా ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంటే విడుదలకు ఇంకా సరిగ్గా ఏడాది సమయముంది. 

ఇక ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ గ్లింప్స్ లో విలన్ ఫేస్ ని రివీల్ చేయలేదు. ప్రస్తుతానికి విలన్ ఎవరనే దానిపై సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు.