Read more!

English | Telugu

ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ మూవీ. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

థ్రిల్లర్ సినిమాలకి ఉండే క్రేజే వేరు. అందులోను ఓటీటీలు వచ్చాక వీటికి డిమాండ్ బాగా పెరిగింది. అందుకేనేమో మేకర్స్ వీటిని తీయడానికే ఎక్కువగా ఇష్టపడతున్నారు. అయితే సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలలో ఉండే ట్విస్ట్ లు ప్రేక్షకులకి మరింత ఎంగేజింగ్ గా అనిపిస్తాయి.

అందుకే మిస్టరీ థ్రిల్లర్ మూవీలకోసం ప్రేక్షకులు ఎంతగానో చూస్తుంటారు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమా ఫేమ్ నందిత శ్వేత, వైభవ్ జంటగా నటించిన మూవీ 'రణం'. తమిళంలో 'రణం అరమ్ థవరేల్' పేరుతో ఫిబ్రవరి 23 న థియేటర్లలో రిలీజైన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. సిటీలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. వాటిని  ఛేదించే కథాంశంతో దర్శకుడు షరీఫ్ ఈ మూవీని తీసుకొచ్చాడు. అయితే ఈ మూవీ ఈ నెల 19 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇప్పటికి తమిళంలోనే ఉన్న ఈ సినిమాని తెలుగు, కన్నడ, మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ మూవీలో నందిత శ్వేత పాజిటివ్ షేడ్స్ లో కాకుండా నెగెటివ్ షేడ్స్ లో కన్పిస్తోందంట. వైభవ్ ఈ మూవీతో సత్తా చాటాడని , తెలుగు ప్రేక్షకులకి మంచి థ్రిల్లర్ ని చూసామని భావిస్తారని మేకర్స్ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. రేపు అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న ఈ మూవీని ఎంచక్కా చూసేయ్యండి.