English | Telugu

విజయ్‌కాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల.. ఆందోళనలో అభిమానులు

తమిళ్‌ సీనియర్‌ నటుడు, రాజకీయ నేత విజయ్‌కాంత్‌ గత కొన్ని రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఎప్పటిక్పుడు డాక్టర్లు ఆయన ఆరోగ్యపరిస్థితిని తెలుపుతూ హెల్త్‌ బులెటిన్లు విడుదల చేస్తున్నారు. అయితే విజయ్‌కాంత్‌ ఆరోగ్యం విషమించిందనే వార్తలు వైరల్‌ అవ్వడంతో అభిమానుల్లో ఆందోళన పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తాజాగా ఎంఐఓటీ హాస్పిటల్‌ డాక్టర్లు మరో హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు.

‘విజయ్‌కాంత్‌ ఆరోగ్యం కాస్త మెరుగుపడినా.. గత 24 గంటలుగా ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్‌గానే ఉంది. చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తున్నప్పటికీ.. పరిస్థితి విషమంగానే ఉంది. అతడు కోలుకోవడానికి పల్మనరీ చికిత్సను వైద్య నిపుణులు సిఫార్సు చేశారు. అంతేకాదు, ఆయన కోలుకోవడానికి మరో 14 రోజుల పాటు నిరంతర చికిత్స అవసరం’ అంటూ ఆ హెల్త్‌ బులెటిన్‌లో తెలియజేశారు. విజయ్‌ కాంత్‌ ఆరోగ్యం క్షీణించడంతో ఈనెల 18న ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. కొంతకాలంలో విజయ్‌కాంత్‌ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చాలా కాలంగా ఆయనకు డయాబెటీస్‌ ఉంది. లివర్‌ సమస్యతో కూడా బాధపడుతున్నారు. అంతేకాదు, జలుబు, దగ్గు, గొంతునొప్పితో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హాస్పిటల్‌లో జాయిన్‌ చేశారు. తాజాగా విడుదలైన హెల్త్‌ బులెటిన్‌తో విజయ్‌కాంత్‌ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో, నాయకుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.