English | Telugu
సిద్ధార్థ్‌పై సీనియర్ నటుడి ఫిర్యాదు
Updated : Aug 13, 2023
దక్షిణాదిన తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించిన అతి కొద్ది మంది హీరోల్లో సిద్ధార్థ్ ఒకరు. ఆ మధ్య తెలుగు సినీ ఇండస్ట్రీతో డిస్టన్స్ మెయిన్‌టెయిన్ చేస్తూ వచ్చిన ఈయన ఇప్పుడు వరుస సినిమాలతో సందడి చేయటానికి రెడీ అయ్యారు. సినిమాలే కాదు.. కొన్ని పొలిటికల్ అంశాలపై కూడా సదరు నటుడు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతుంటారు. బీజేపీ పని తీరుని ఆయన తప్పు పట్టిన సందర్భాలున్నాయి. అయితే ఓ సీనియర్ తమిళ నటుడు బీజేపీకి సపోర్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనతో కలిసి నటించటానికి సిద్ధార్థ్ ఒప్పుకోలేదట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. సదరు సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు. అదెవరో కాదు.. ఎస్.వి.శేఖర్.
వివరాల్లోకి వెళితే, రీసెంట్‌గా తమిళ చిత్రం లోకల్ సారక్క ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అందులో ఎస్.వి.శేఖర్ కూడా పాల్గొన్నారు. ఆయన స్టేజ్‌పై సిద్ధార్థ్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. "టెస్ట్ అనే సినిమాలో సిద్ధార్థ్ తండ్రిగా నటించాలని నిర్మాత శశికాంత్ నన్ను సంప్రదించారు నేను సరేనన్నాను. ఆ తర్వాత మోడీ మద్దుతుదారుడైన తనతో సినిమా చేయటానికి సిద్ధార్థ్ ఆసక్తి చూపటం లేదని సదరు నిర్మాత నాతో అన్నారు. కథ మారిందని అందుకనే నన్ను తీసుకోవటం లేదని అన్నారు. రాజకీయాలు వేరు, నటన వేరు. ఈరకంగా చూస్తే సిద్ధార్థ్ నాతో పని చేయటానికి భయపడ్డాడనిపిస్తుంది. అందువల్ల నేను ఈ విషయాన్ని నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాను" అని తెలిపారు ఎస్.వి.శేఖర్.
సిద్ధార్థ్ ముందు నుంచి బీజేపీ తీరుని సోషల్ మీడియాలో వేదికగా విమర్శిస్తూనే ఉన్నారు. దానికి ఆయనపై బీజీపీ వర్గాలు సైతం కామెంట్స్ చేశాయి. ఇలాంటి సందర్భంలో ఎస్.వి.శేఖర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.