Read more!

English | Telugu

సన్నీ లియోన్ కు కలో నిజమో అర్ధం కాలేదట..!

ఒకప్పటి పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ను బాలీవుడ్ బాగానే ఆదరిస్తోంది. ఇప్పటికీ అందాల ప్రదర్శన మీదే అమ్మడు ఆధారపడుతున్నా, వీలైనంత వరకూ తాను బాలీవుడ్ హీరోయిన్ ను అని తనను తాను చూపించుకోవడానికి సన్నీ చాలా కష్టపడుతోంది. ఆల్రెడీ ఈ అమ్మడికి అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి స్టార్స్ సపోర్ట్ లభించిన సంగతి తెలిసిందే. షారుఖ్ అయితే, తన రయీస్ సినిమాలో ఐటెం సాంగ్ కోసం సన్నీనే ప్రిఫర్ చేశాడు. 1980ల్లో ఖుర్బానీ సినిమాలోని లైలా ఓ లైలా సాంగ్ ను రయీస్ కోసం రీమిక్స్ చేస్తున్నాడు షారుఖ్.

ఈ పాటకు సన్నీ అయితేనే యాప్ట్ గా ఉంటుందని, సినిమాకు కూడా కావాల్సినంత పబ్లిసిటీ లభిస్తుందని కింగ్ ఖాన్ ప్లాన్. లేటెస్ట్ గా సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టిన సన్నీ, అక్కడ షారుఖ్ ను స్వయంగా చూసే సరికి నమ్మలేకపోయిందట. షూటింగ్ జరుగుతున్నంత పాటూ, నేనేంటి షారుఖ్ తో స్టెప్స్ వేయడమేంటి అంటూ తనను తాను గిల్లుకుంటూ చూసుకుందట. ఈ రోజు కోసం నేను ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను అంటూ ఈ సుందరి ట్వీటింది. అంతే మరి. తన గతంతో పోలిస్తే, బాలీవుడ్ కింగ్ ఖాన్  షారుఖ్ తో స్టెప్స్ వేసే రేంజ్ కు ఎదిగినందుకు ఎంతైనా సన్నీని మెచ్చుకోవాల్సిందే..