English | Telugu

ఘనంగా ప్రారంభమైన "పూలరంగడు"

ఘనంగా ప్రారంభమైన "పూలరంగడు" చిత్రం. వివరాల్లోకి వెళితే ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో, మ్యాక్స్ ఇండియా పతాకంపై, సునీల్ హీరోగా, ఇషా చావ్లా హీరోయిన్ గా, "అహ నా పెళ్ళంట" ఫేం వీరభద్ర చౌదరి దర్శకత్వంలో, కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం "పూలరంగడు". ఆగస్ట్ 18 వ తేదీ ఉదయం, హైదరాబాద్ అన్నపూర్ణ స్టుడియోలో, ప్రముఖ దర్శకులు రాజమౌళి క్లాప్ కొట్టగా, మరో ప్రముఖ దర్శకుడు సుకుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ముహూర్తం షాట్ కు గౌరవ దర్శకత్వం వహించగా, ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది.

అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ముందుగా హీరో సునీల్ ప్రసంగిస్తూ "యమలీల" వంద రోజులాడిన సందర్భంలో తాను హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో, దిల్ షుక్ నగర్ నుండి అచ్చిరెడ్డి గారి ఆఫీస్ కి వెళ్ళి తాను డ్యాన్స్ చేసిన వీడియో సి.డి.ని చూపించాననీ, దాన్ని చూసిన అచ్చిరెడ్డి బాగుందని ప్రోత్సహించారనీ, తనను ఆయన కారులో ఖైరతాబాద్ వరకూ దించారనీ, ఈ రోజున ఆయన సినిమాలో హీరోగా చేయటం ఆనందంగా ఉందనీ అన్నారు.

ఈ చిత్ర దర్శకులు వీరభద్రచౌదరి ప్రసంగిస్తూ తన మొదటి చిత్రం "అహ నా పెళ్ళంట" ని హిట్ చేసిన ప్రేక్షకులకూ, పాత్రికేయ మిత్రులకూ ముందుగా కృతజ్ఞతలు తెలిపి, తాను సునీల్ గారికి కథ చెప్పగానే ఆయనే నిర్మాత అచ్చిరెడ్డి గారని చెప్పారనీ, ఈ "పూలరంగడు" సినిమా మంచి హిట్టవుతుందనీ, తనకు ఈ అవకాశమిచ్చిన అచ్చిరెడ్డి గారికీ, సునీల్ గారికీ తన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తూండగా, మన రాష్ట్ర నంది అవార్డు గ్రహీత ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తూండగా, "అహ నా పెళ్ళంట" ఫేం శ్రీధర్ మాటలు వ్రాస్తున్నారు. నిర్మాత అచ్చిరెడ్డి ప్రసంగిస్తూ సెప్టెంబర్ రెండు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, 2012 సంక్రాంతి పండుగకు ఈ "పూలరంగడు" చిత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.