English | Telugu

సుజీత్ సినిమాటిక్ యూనివర్స్.. ఓజీలో పవన్ తో పాటు మరో ఇద్దరు స్టార్స్!

సౌత్ ఇండియాలో సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ ఊపందుకుంటోంది. కోలీవుడ్ లో లోకేష్ కనగరాజ్ ఈ ట్రెండ్ కి శ్రీకారం చుట్టాడు. టాలీవుడ్ లోనూ 'హనుమాన్'తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అయింది. అలాగే, మాలీవుడ్ లో ఇటీవల లోకా సినిమాటిక్ యూనివర్స్ కి అడుగు పడింది. ఇప్పుడిదే బాటలో టాలీవుడ్ లో మరో యూనివర్స్ మొదలు కానుందని తెలుస్తోంది. దీని క్రియేటర్ ఎవరో కాదు.. 'ఓజీ' డైరెక్టర్ సుజీత్. (They Call Him OG)

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన మూవీ 'ఓజీ'. డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ మూవీ మరి కొద్ది గంటల్లో థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈరోజు రాత్రి నుంచే ప్రీమియర్స్ పడనున్నాయి. ఇలాంటి సమయంలో 'ఓజీ'కి సంబంధించిన ఓ వార్త.. సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

Also Read:ఓజీ రికార్డు బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ తెలిస్తే షాక్!

'ఓజీ'తో సుజీత్.. ఓ సినిమాటిక్ యూనివర్స్ ని స్టార్ట్ చేస్తున్నాడట. ప్రభాస్ తో చేసిన ఆయన గత చిత్రం 'సాహో'కి, ఓజీ కథతో లింక్ ఉంటుందని వినికిడి. అంతేకాదు, సుజీత్ నెక్స్ట్ నానితో చేయబోయే సినిమాతోనూ.. 'ఓజీ'కి లింక్ ఉంటుందట. సాహో ప్రపంచంతో పాటు, సాహోలోని కొన్ని కీలక పాత్రలు 'ఓజీ'లో కనిపిస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ కాసేపు కనిపించి సర్ ప్రైజ్ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇక ఓజీ సినిమా చివరిలో నానిని పాత్రని పరిచయం చేసి, నెక్స్ట్ మూవీకి లీడ్ కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే ఎక్కడ చూసినా 'ఓజీ' మేనియా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు, సినీ ప్రియులంతా "ఓజీ ఓజీ" అంటూ ఊగిపోతున్నారు. అలాంటిది, ఈ సినిమాలో ప్రభాస్, నాని కూడా కనిపిస్తే.. సినీ అభిమానులకు అంతకంటే బిగ్ ట్రీట్ ఉండదని చెప్పవచ్చు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.