English | Telugu

మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ కథ ఏంటి?

మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు జనవరి 26. ఈ సందర్భంగా అతని 77వ సినిమా టైటిల్‌ను రివీల్ చేసింది చిత్ర యూనిట్. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి ‘ఇరుముడి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇరుముడి అనేది అయ్యప్ప స్వామి భక్తులకు ఎంతో పవిత్రమైంది. సినిమాకి ఈ టైటిల్ పెట్టారంటే కథలో ఆధ్యాత్మికతతో కూడిన బలమైన కథ ఉంటుందని అర్థమవుతుంది.

సాధారణంగా రవితేజ సినిమాలు పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల్లో జోష్ పెంచేలా ఉంటాయి. అయితే దానికి భిన్నంగా అతని 77వ సినిమాకి ఇరుముడి అనే టైటిల్ పెట్టడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటివరకు రవితేజ చేసిన 76 సినిమాల్లో ఏ సినిమాకీ ఈ తరహా టైటిల్‌ను ఫిక్స్ చేయలేదు. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో అయ్యప్ప స్వాముల మధ్యలో తలపై ఇరుముడితో ఓ పాపను ఎత్తుకొని కనిపిస్తున్నారు రవితేజ.

‘ఇరుముడి’ ఫస్ట్ లుక్‌లోనే ఇది తండ్రీ కూతుళ్ల మధ్య నడిచే ఓ ఎమోషనల్ డ్రామా అనే హింట్ ఇచ్చారు శివ నిర్వాణ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే ఓ విభిన్నమైన సినిమా కాబోతోంది. ‘కొన్ని కథలు సరైన సమయంలో మనల్ని వెతుక్కుంటూ వస్తాయి’ అంటూ ఈ సినిమాపై తనకు ఉన్న కాన్ఫిడెన్స్‌ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు రవితేజ. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో సాయికుమార్, అజయ్ ఘోష్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం