English | Telugu

SSMB29 నుంచి బిగ్‌ అప్‌డేట్‌.. సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ‘కుంభ’ ఫస్ట్‌లుక్‌!

మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. ఈ పోస్టర్‌ ద్వారా ‘కుంభ’ గెటప్‌లో ఉన్న పృథ్విరాజ్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. వీల్‌చైర్‌లో కూర్చుని, రోబోటిక్‌ సపోర్ట్‌తో ఉన్న శక్తివంతమైన వ్యక్తిగా కనిపించారు. వీల్‌ చైర్‌లో ఉంటూ ఎన్నో అద్భుతాలు సృష్టించిన శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ గురించి మనకు తెలుసు. అతని స్ఫూర్తితోనే కుంభ క్యారెక్టర్‌ను డిజైన్‌ చేశారని అర్థమవుతోంది.

SSMB29కి సంబంధించి నవంబర్‌ 15న మరిన్ని అప్‌డేట్స్‌ రాబోతున్నాయి. ఈ సినిమా టైటిల్‌ ఏమిటి అనే విషయంలో ఇప్పటివరకు రకరకాల చర్చలు జరిగాయి. అయితే ఈ సినిమాకి ఏ టైటిల్‌ పెడతారు అనే విషయంలో నవంబర్‌ 15న క్లారిటీ రాబోతోంది. అదే రోజున మహేష్‌ ఫస్ట్‌లుక్‌తోపాటు 2 నిమిషాల నిడివి ఉన్న కాన్సెప్ట్‌ వీడియోను కూడా రిలీజ్‌ చెయ్యబోతున్నారు.

టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు ప్రపంచవ్యాప్తంగా మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి ఫస్ట్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్‌ అడ్వెంచర్‌ జోనర్‌లో ఉండబోతోంది. ఇప్పటివరకు మహేష్‌ కనిపించని ఒక డిఫరెంట్‌ లుక్‌లో రాబోతున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్‌ హీరో పృథ్విరాజ్‌ సుకుమారన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

కుంభ పాత్రలో అతని నటనను చూసిన రాజమౌళి ‘ఫస్ట్‌ షాట్‌ తీసిన వెంటనే పృథ్వీ దగ్గరికి వెళ్లి.. నేను చూసిన అత్యంత గొప్ప నటుల్లో నువ్వు ఒకరు అని చెప్పాను. ఈ దుర్మార్గుడైన, నిర్దాక్షిణ్యమైన, శక్తివంతమైన ప్రతినాయకుడు ‘కుంభ’ పాత్రకు జీవం పోయడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఈ కుర్చీలో అక్షరాలా నువ్వు జారిపోయి ఆ పాత్రలో కలిసిపోయినందుకు ధన్యవాదాలు పృథ్వీ’ అంటూ పోస్ట్‌ చేశారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం