English | Telugu

రాజ‌మౌళి కాదు.. మోళి!!

ఔను... రాజ‌మౌళికి మోళి చేయ‌డం వ‌చ్చు. అదేనండీ.. మాయ‌! ఎంత మాయ‌కారి కాక‌పోతే... వ‌రుస‌గా అన్ని విజ‌యాలు సాధ్య‌మ‌వుతాయి?? ఒక‌టా రెండా..?? చేసిన ప్ర‌తి సినిమా హిట్టే. ఒక మెట్టు త‌ర‌వాత మ‌రో మెట్టు ఎక్కుతారంతా! కానీ మెట్లు వ‌దిలి మేఘాలు దాటి, ఆ కాశంలో కూర్చున్నాడు. మోళి కాక‌పోతే మ‌రేంటి??

సినిమా టికెట్టు కొన‌డం, థియేట‌ర్లో కూర్చోవ‌డం వ‌ర‌కే మ‌న‌కు గుర్తుంటుంది. ఆ త‌ర‌వాత మ‌న‌ల్ని స్వాధీనం చేసుకొంటాడు రాజ‌మౌళి. మ‌న‌ల్ని ఆడిస్తాడు, ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాడు! రాజ‌మౌళి సినిమాకెళ్తే.. హీరోని పిచ్చ‌పిచ్చ‌గా ఆరాధించ‌డం మొద‌లెడ‌తాం. హీరోయిజంలో ఇంత కిక్కుందా అనిపిస్తుంది. ఒక్కోసారి ఆ దేవుడు కంటే హీరోనే బ‌ల‌వంతుడు అనిపిస్తుంది. అలా న‌మ్మించ‌గ‌ల‌డు. మిగ‌తా ద‌ర్శ‌కులు ఇది అసాధ్యం.. రాజ‌మౌళికి త‌ప్ప‌... ఇంత‌కంటే మాయ మ‌రోటి ఉంటుందా..?.

రావ‌ణాసురుడు బ‌ల‌వంతుడు కాబ‌ట్టే రాముడికి అంత పేరొచ్చింది!
- రాజ‌మౌళి న‌మ్మేసూత్రం ఇదే. విల‌న్ స్ట్రాంగ్ అయితేనే, హీరో స్ట్రాంగాతి స్ట్రాంగ్ అవుతాడు. అందుకే రాజ‌మౌళి సినిమాలో విల‌న్లు అంత‌లా గుర్తుండిపోతారు. రాజ‌మౌళి సినిమాల్లో హీరోకి రెండు పార్శ్వాలుంటాయి. స్టూడెంట్ నెంబ‌ర్‌వ‌న్‌, సింహాద్రి, ఛ‌త్ర‌ప‌తి, విక్ర‌మార్కుడు.. ఇలా ఏ సినిమా అయినా తీసుకోండి. ఆ ల‌క్ష‌ణం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఒక పార్శ్వం విల‌న్‌కో, ప‌రిస్థితుల‌కో లోబ‌డి త‌ల‌వొంచేది. మ‌రోటి... ఆకాశాన్ని సైతం కింద‌కు దించే... ప‌వ‌ర్‌! రాజ‌మౌళి సినిమాలో చివ‌రి వర‌కూ విల‌న్‌దే ఆధిప‌త్యం! కానీ ఏదో ఓసారి హీరో తిర‌గ‌బ‌డ‌తాడు. తోలు తీస్తాడు. అదీ మామూలుగా ఉండ‌దు.. జింతాత జితా జితానే.

క‌మ‌ర్షియ‌ల్ సినిమాకి కొత్త‌క‌ల‌రింగు ఇచ్చాడు ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు. అత‌ని శిష్యుడు క‌దా.. నాలుగు ఆకులు ఎక్కువే చ‌దివొచ్చాడు. క‌మ‌ర్షియాలిటీకి ఆధునిక‌త అద్దాడు! అందుకే రాజ‌మౌళి సినిమాలు టెక్నిక‌ల్‌గా హై స్టాండ‌ర్డ్‌లో ఉంటాయి.రాజ‌మౌళికీ, ఈనాటి మిగిలిన ద‌ర్శ‌కుల‌కీ తేడా ఏంటంటే, చాలామంది హీరోల కోసం వెదుతుతారు.రాజ‌మౌళి మాత్రం హీరోల్ని సృష్టించుకొంటాడు. మ‌ర్యాద రామ‌న్న‌, ఈగ అందుకు సాక్ష్యాలు. ఈగ‌తో సినిమా తీయ‌డం ఏంటండీ..?? ఈగ‌ని మాస్ హీరోని చేయ‌డం ఏంటంటీ...? రాజ‌మౌళిలోని మోళి ఇక్క‌డే బయ‌ట‌ప‌డింది.

సినిమా త‌ప్ప మ‌రో ప్ర‌పంచం తెలీదంటారు రాజ‌మౌళికి. ఆయ‌న‌తో ప‌నిచేసిన వాళ్లు, చేస్తున్న‌వాళ్లూ ఇదే చెప్తారు. సినిమాలో ప‌డి, అందులో మున‌కేసి, అదే క‌ల‌కంటూ... క‌న్న‌క‌ల‌ని సినిమాగా తీస్తూ.. షాక్‌ల మీద షాక్‌లిస్తున్నాడు జక్క‌న్న‌! రేపు బాహుబ‌లి, ఆ త‌ర‌వాత స్టార్ హీరోని ప‌ట్టుకొన్నా, కొత్త మొహాన్ని ఎంచుకొన్నా - రాజ‌మౌళి సినిమాల‌కు ఉండే క్రేజ్ మ‌రో ప‌దింత‌లు పెరుగుతుంది కానీ, త‌గ్గ‌దు. ద‌టీజ్ రాజ‌మౌళి!

హిట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడు, తెలుగు సినిమా స్టామినాని మ‌రో ప‌దింత‌లు చేసిన ద‌ర్శ‌క ధీరుడు! అందుకే తెలుగు సినీ ప్ర‌పంచం మొత్తం.. అత‌ని వంక ఆశ‌గా ఎదురుచూస్తోంది. ఎన్ని అద్భుతాలు సృష్టిస్తాడో అని. ఇంకెంత మాయ చేస్తాడో అని. ఆ మాయ‌కి బాహుబ‌లి నిద‌ర్శ‌నం కావాలి. మ‌రో అద్భుతానికి తెర లేపాలి. అలాంటి రోజు కోసం ఎదురుచూస్తూ...
జ‌క్క‌న్న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.