English | Telugu

'శ్రీమంతుడు' లుంగీ స్టైల్ అదిరింది

'శ్రీమంతుడు' సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతున్నడంతో ప్రచార౦ జోరు పెంచుతున్నారు. ఈ సినిమాకి మహేష్ కూడా ఓ నిర్మాత కావడంతో పబ్లిసిటీ పై మన సూపర్ స్టార్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నాడు. మీడియాలో తెగ హంగామా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఒక్కో వీడియో సాంగ్, ఒక్కో స్టిల్ రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నారు.

లేటెస్ట్ గా మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా ఈ సినిమాకి సంబంధించిన ఓ ప్రత్యేకమైన స్టిల్ రిలీజ్ చేసి అందరి దృష్టి ఆకర్షించాడు. ఈ ఫోటోలో మహేష్ లుంగీ కట్టి విలేజ్ లో సరదాగా నడుచుకుంటూ వెళుతుంటే అందరూ అతని వైపు చూస్తున్నారు. మరి మహేష్ బాబు లాంటి అందగాడు లుంగీ కట్టి స్టైల్ గా నడుస్తుంటే ఎవరైనా చూపు తిప్పుకోగలరా? మీరే చెప్పండీ.

మహేష్‌కి వున్న మార్కెట్‌ గురించి కొత్తగా చెప్పేదేముంది.? సాదా సీదా సినిమాతోనూ కలెక్షన్ల వర్షం కురిపించగలడు..మరి ఇంత భారీ హైప్ నెలకొన్న శ్రీమంతుడితో సెంచరీ కొడతాడా? లేదా? అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.