English | Telugu

శ్రీదేవి దగ్గరుండే ఆ పని చేయిస్తోందా?

ఎంత తొందరగా ఇండస్ట్రీలోకి తోసేద్దామా- ఎంత త్వరగా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుందామా అని తెగ యాతనపడిపోతోందట ఒకప్పటి అతిలోకసుందరి శ్రీదేవి. అందుకే తనకు తెలిసిన వాళ్లందరికీ ఫోన్లు చేసి హైరానాపడిపోతున్నా....ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. పైగా జాహ్నవికి శ్రీదేవి కూతురు అనే బ్రాండ్ తప్ప హీరోయిన్ కి ఉండాల్సిన ఒక్క ఫీచర్ కూడా లేదని తెల్చిపడేశారు. ఆ మధ్య మాత్రం షారుఖ్ కొడుకుతో జాహ్నవి పరిచయమవుతుందనే ప్రచారం బీటౌన్లో జరిగింది. ఆసంగతి పక్కనపెడితే ఈ సారి మరో అడుగు ముందుకేసి కూతురితో దగ్గరుండి మరీ వలువలు విప్పించేస్తోందట శ్రీదేవి. నిక్కర్ వేసినా, బికినా వేసినా మొన్నటి వరకూ తల్లిచాటు బిడ్డలా ఉండే జాహ్నవి ఈమధ్య పబ్లిక్ పార్టీస్ లో రెచ్చిపోతోంది. జాహ్నవి సెక్సీలుక్ చూసిన వారంతా వయసొచ్చేసింది....హీరోయిన్ లక్షణాలు మెండుగా ఉన్నాయని కామెంట్ చేస్తున్నారట. మరోవైపు హాట్ హాట్ గా రెచ్చిపోతే సరిపోదు....కాస్త విషయం ఉండాలని డిస్కస్ చేసుకుంటున్నారు. అయినా ఎక్స్ పోజింగ్ చేస్తేనే శ్రీదేవి ఈ స్థాయికి వచ్చిందా? అని క్వశ్చన్ చేస్తున్నారట. మరి వయసుకు మించి రెచ్చిపోతున్న జాహ్నవి కష్టానికి ఫలితం దక్కుతుందో లేదో?

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.