English | Telugu

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చిన నిఖిల్ 'స్పై'

'కార్తికేయ-2' తర్వాత నిఖిల్ మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతాడని నమ్మకం కలిగించిన చిత్రం 'స్పై'. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా జూన్ 29న విడుదలై అంచనాలకు అందుకోలేక నిరాశపరిచింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంలో రూపొందిన సినిమాగా ప్రచారం పొందిన స్పై, మొదటిరోజు మంచి ఓపెనింగ్స్ అయితే రాబట్టింది గానీ, ప్రేక్షకులను మెప్పించలేక పరాజయం పాలైంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయిన ఈ సినిమా, తాజాగా సైలెంట్ గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

థియేటర్స్ లో రిజల్ట్ తో సంబంధం లేకుండా, ఓ సినిమా ఓటీటీలోకి వస్తుందంటే కాస్త ముందుగానే తేదీని ప్రకటించి ప్రచారం కల్పిస్తుంటారు. కానీ 'స్పై' విషయంలో అలా జరగలేదు. థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకే ఎలాంటి అప్డేట్ లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. 'స్పై' ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ముందుగా ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండానే ప్రైమ్ వీడియో ఈరోజు(జూలై 27) నుంచి 'స్పై' స్ట్రీమింగ్ స్టార్ట్ చేసింది. స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యాక స్పై సినిమాని చూసి ఆనందించండి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా, తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.