English | Telugu

రీరికార్డింగ్‌ దిగ్గజం స్వామినాథన్ మృతి


సినీ పరిశ్రమలో సౌండ్ ఇంజనీర్‌గా అపార అనుభవం గల ఏఆర్ స్వామినాథన్ ఇకలేరు. మంగళవారం ఆయన చెన్నైలో కన్నుమూశారు. సుమారు 1900 చిత్రాలకు సౌండ్ ఇంజనీర్‌గా పని చేశారు. ప్రపంచంలో మరెవరికీ ఈ ఘణత దక్కకపోవచ్చు. లక్షకు పైగా పాటలు ఆయన రికార్డు చేశారు. వాహినీ సంస్థలో అప్రెంటీస్‌గా చేరిన ఆయన అనతి కాలంలోనే రికార్డిస్టుగా మారారు. 1949లో శబ్ద యంత్రాలను చూసుకునే పనితో మొదలు పెట్టిన ఆయన 1953లో ‘పరోపకారం’ చిత్రానికి తొలిసారి రీరికార్డింగ్ చేశారు. స్వామినాధన్ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ తదితర భాషా చిత్రాలకు ఆయన సౌండ్ ఇంజనీర్‌గా పనిచేశారు. వాహినీ తర్వాత ఆయన విజయా, కోదండపాణి రికార్డింగ్ థియేటర్లలో పనిచేశారు. రీరికార్డింగ్ ప్రక్రియకు కొత్త సొబగులు దిద్దిన మహనీయుడిగా సినీపరిశ్రమ ఆరాధించే వ్యక్తి స్వామినాథన్. పాండురంగ మహాత్మ్యం, పాండవ వనవాసం, అల్లూరి సీతారామరాజు, శంకరాభరణం, సంపూర్ణ రామాయణం ఇవి ఆయన పని చేసిన తెలుగు చిత్రాలలో కొన్ని. స్వామినాథన్ ఎన్నో నందీ పురస్కారాలు అందుకున్నారు.
87 ఏళ్ల స్వామినాథన్ పదిహేను రోజులుగా ఆయన అనారోగ్యంగా వున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన తుంటి ఎముకకు శస్త్ర చికిత్స జరిపించారు. మంగళవారం ఉదయం 11.20 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.


అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.