English | Telugu

ఘనంగా సైమా అవార్డుల వేడుక.. విజేతలు వీరే!

దుబాయ్‌ వేదికగా సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌(సైమా 2025) 13వ ఎడిషన్‌ ఘనంగా జరిగింది. మొదటి రోజు 2024లో రూపొందిన తెలుగు, కన్నడ చిత్రాలకు సంబంధించిన పురస్కారాలను అందజేశారు. కల్కి 2898ఎడి, పుష్ప2 చిత్రాలకు నాలుగు విభాగాల్లో అవార్డులు దక్కాయి. ప్రేక్షకుల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన కల్కి 2898ఎడి చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు, పుష్ప2 చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించిన అల్లు అర్జున్‌కి ఉత్తమ నటుడుగా, ఉత్తమ నటిగా రష్మిక మందన్న అవార్డులు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా సుకుమార్‌, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్‌, ప్రైడ్‌ ఆఫ్‌ తెలుగు సినిమా అవార్డును వైజయంతీ మూవీస్‌ అధినేత అశ్వినీదత్‌ అందుకున్నారు.

2025 సైమా అవార్డుల విజేతలు వీరే:

ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ (పుష్ప2)
ఉత్తమ నటి: రష్మిక (పుష్ప2)
ఉత్తమ దర్శకుడు: సుకుమార్‌ (పుష్ప2)
ఉత్తమ విలన్‌: కమల్‌ హాసన్‌ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్‌ బచ్చన్‌ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ సహాయ నటి: అన్నా బెన్‌ (కల్కి 2898 ఏడీ)
ప్రైడ్‌ ఆఫ్‌ తెలుగు సినిమా : అశ్వినీదత్‌ (వైజయంతీ మూవీస్‌)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్‌ (పుష్ప2)
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్‌): ప్రశాంత్‌వర్మ (హనుమాన్‌)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: రత్నవేలు (దేవర)
ఉత్తమ గీత రచయిత: రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లే)
ఉత్తమ నేపథ్య గాయని: శిల్పారావ్‌ (చుట్టమల్లే)
ఉత్తమ నూతన నటి: భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్‌ బచ్చన్‌)
ఉత్తమ హాస్య నటుడు: సత్య (మత్తు వదలరా 2)
ఉత్తమ నూతన నిర్మాత : నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): తేజ సజ్జా (హనుమాన్‌)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌): మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్‌)

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం