English | Telugu

మూవీలో నేను ఎందుకు హైలెట్ అయ్యానంటే.. శ్రియారెడ్డి చెప్పిన నిజం 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వన్ మాన్ షో 'ఓజి'(OG)ద్వారా మరోసారి తను ఎంత బలమైన నటినో ప్రూఫ్ చేసుకుంది శ్రియారెడ్డి(Shriya Reddy).ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు తమ పోర్ట్ ని రక్షించుకోవడానికి చూసే 'గీత' క్యారక్టర్ లో విజృంభించి నటించిందని చెప్పవచ్చు. ప్రీవియస్ మూవీ సలార్(Salaar)లో కూడా 'రాధారమ' రోల్ లో సూపర్ గా చేసింది. అసలు ఆ క్యారక్టర్ లో ఆమెని తప్ప మరొకర్ని ఉహించుకోలేం. ఆమె లుక్ కూడా ప్రభాస్, పృథ్వీ రాజ్ సుకుమారన్ కి ఏ మాత్రం తీసుకొని విధంగా చాలా శక్తివంతంగా ఉంది.

రీసెంట్ గా శ్రియారెడ్డి ఒక ఇంటర్వ్యూలో సలార్ లోని తన లుక్ గురించి మాట్లాడుతు సలార్ లో నా క్యారక్టర్ కి సంబంధించి కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు 50 ,60 ఫుష్ అప్స్ చేసేదాన్ని. కాస్ట్యూమ్స్ వేసుకొని ఉన్నా, క్యారవాన్ లో ఉన్నా ఇది తప్పనిసరి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఈ విషయం ముందుగానే చెప్పడంతో వాళ్ళు కూడా సీన్ విషయం కొంచం ముందుగానే చెప్పేవారు. దాంతో పుష్ అప్స్ చేసి సీన్ లోకి ఎంటర్ అయ్యేదాన్ని. అందుకే నేను శక్తివంతురాలిగా కనిపించేదాన్ని. నా వరకైతే బస్కీలు తియ్యడం అనేది సులభమైన వర్క్ అవుట్ అని శ్రియారెడ్డి చెప్పుకొచ్చింది.

2002 లో సమురాయ్ అనే తమిళ చిత్రంతో హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రీయారెడ్డి,ఆ తర్వాత ఏడాది 'అప్పుడప్పుడు' అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.2008 లో ప్రముఖ నటుడు, నిర్మాత విక్రమ్ కృష్ణ తో పెళ్లి తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. సలార్ తో నటిగా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిందని చెప్పవచ్చు. ప్రముఖ హీరో విశాల్(Vishal)కి విక్రమ్ కృష్ణ సోదరుడు.



'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.