English | Telugu

రన్ రాజా రన్ ట్రెయిలర్స్‌లో శర్వానంద్ న్యూలుక్


ఆల్‌రెడీ డీసెంట్ లుక్, డీసెంట్ ఇమేజ్ వున్న శర్వానంద్ ఇకపై కూల్ అండ్ ఫన్ గై గా కనిపిస్తే ఎలా వుంటుంది. అయితే "రన్ రాజా రన్'' ఫస్ట్ లుక్ చూస్తే తెలిసిపోతుంది. ఇప్పటికే ఈ సినిమా సాంగ్ ట్రెయిలర్లు రిలీజ్ అయి నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. అమ్మ చెప్పింది సినిమాలో అమాయకుడిగా కనిపించిన శర్వానంద్, "రన్ రాజా రన్'' సినిమా హీరో ఒక్కరే అంటే పోల్చుకోలేం. అంత హ్యాండ్‌సమ్ అండ్ కూల్ లుక్స్ తో కనిపిస్తున్నాడు శర్వానంద్.
సీరత్ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు కలిసి నిర్మించారు. ఈ చిత్ర ఆడియో ఫంక్షన్‌కి ప్రభాస్, గోపిచంద్ లు వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో డిఫరెంట్ గా వుంటాడని ఆడియో ఫంక్షన్ లో చెబితే, అందరూ చెప్పే రోటీన్ మాటే అనుకున్నారు. కానీ నిజంగానే శర్వానంద్ ఇందులో కొత్తగా కనిపిస్తున్నాడు. విడుదలైన వీడియోలు చూస్తుంటే ఈ సినిమాలో కామెడీ, లవ్ రెండూ ట్రాక్‌లు బేషుగ్గా వుంటాయనిపిస్తోంది. ఈ చిత్రం ద్వారా శర్వానంద్ కొత్త ఇమేజ్‌ కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.


50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.