Read more!

English | Telugu

‘శర్మ అండ్ అంబానీ’ మూవీ రివ్యూ

 

మూవీ: శర్మ అండ్ అంబానీ
నటీనటులు : ధన్య బాలకృష్ణ, భరత్ తిప్పిరెడ్డి, కేశవ కర్రీ, మానస్ అద్వైత్, రాజశేఖర్ నర్జాల, విశ్వనాథ్ మాండలిక, యష్, రూపక్ తదితరులు
ఎడిటింగ్: గౌతమ్ రాజు
మ్యూజిక్: శశాంక్ ఆలమూరు
సినిమాటోగ్రఫీ: కేఏ స్వామి
నిర్మాతలు: అనిల్ పల్లా, భరత్ తిప్పిరెడ్డి
దర్శకత్వం: కార్తిక్ సాయి
ఓటీటీ : ఈటీవి విన్

కథ:

రాత్రిపూట వర్షం పడుతుండగా ఒకతను టీవీలో మంతెన సత్యనారాయణ గారి డైట్ ఫుడ్ సూచనలు వింటు వాటిని ఫాలో అవుతుంటాడు. ఇంతలో అతనికి ఓ నెంబర్ నుండి కాల్ వస్తుంది. దాంతో అతను ఓ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి వేరొక అతడిని చంపేసి బ్యాగ్ లో పట్టుకొస్తాడు. ఆ తర్వాత రోజు అంబానీ చెప్పులు పాలిష్ చేస్తుంటాడు. అతడి బాస్ శర్మకు ఒక ఆయుర్వేదిక్ షాప్ ఉంటుంది. ఇక ఇద్దరు కలిసి ప్రతీరోజు షాప్ దగ్గరికి వచ్చే కస్టమర్స్ తో బాగా మాట్లాడుతూ పేరు తెచ్చుకుంటారు. అయితే ఒకరోజు అంబానీకి వజ్రాలు గల చిన్న సంచీ దొరుకుతుంది. అది చూసిన అంబానీ షాక్ అవుతాడు. కాసేపటికి వాళ్ళ బాస్ శర్మకి కాల్ చేసి చెప్తాడు. అయితే శర్మకి నెలనెలా ఇంటి అద్దె కూడా కట్టుకోలేని స్థితిలో ఉంటాడు. ఇక ఇదే సమయంలో అంబానీ తీసుకొచ్చిన వజ్రాలని చూసిన శర్మ అవి నిజమైన వజ్రాలు కాదని చెప్పేసి వెళ్తాడు. అయితే మరుసటిరోజు అంబానీ దగ్గరికి కొంతమంది రౌడీలు వచ్చి ఆ వజ్రాల సంచి గురించి ఆరాతీయగా.. తనకేమీ తెలిదని చెప్పి, కాసేపటికి శర్మకి చెప్పగా అది నమ్మేసి వాటిని అమ్మి డబ్బులు తెచ్చుకోవాలనుకుంటారు. ఆ తర్వాత వారి జీవితాలలో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. శర్మ అండ్ అంబానీ ఆ వజ్రాలని అమ్మగలిగారా? వజ్రాలు దొరికాక వారిద్ధరి జీవితాలు ఎలా మలుపు తిప్పాయనేది మిగతా కథ...

విశ్లేషణ:

ఓ రాత్రిపూట ఒకతడిని దారుణంగా చంపడంతో కథ ఆసక్తిగా మొదలవుతుంది. అసలెవరు చనిపోయింది? చంపిందెవరనే క్యూరియాసిటిని కల్గించిన దర్శకుడు ఆ తర్వాత ఆ ఇంటెన్స్ ని కొనసాగించలేకపోయాడు. వజ్రాలని డీల్ చేసే ఓ గ్యాంగ్ ని చూపిస్తూనే సాధారణ జీవితం గడిపే హీరో అండ్ అతడి ఫ్రెండ్ ని చూపించడం.. వారి జీవితాలలో మార్పు కోసం వజ్రాలని వాళ్ళు అమ్ముకోవాలనుకోవడం లాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికి దర్శకుడు గజిబిజిగా కథని తీసుకెళ్ళాడు.

ట్విస్ట్ లు రెండు మూడు చోట్ల ఉంటాయి. అవి పెద్దగా థ్రిల్ ను పంచవు. హీరోయిన్ పాత్రని సపోర్టింగ్ రోల్ కోసం మాత్రమే తీసుకున్నట్లుగా ఉంది. కథలో కొత్త క్యారెక్టర్స్ ఎంట్రీ ఉన్నా.. ఆ పాత్రలు పెద్దగా సస్పెన్స్ ని క్రియేట్ చేయలేకపోవడంతో పెద్దగా ఆసక్తిగా అనిపించావు. లో ప్రొడక్షన్ క్వాలిటీ ఉండటంతో బ్యాక్ డ్రాప్ సీన్లు బోర్ కొట్టించేస్తాయి.

థ్రిల్లర్ కామెడీ సినిమా అనిచెప్పి ఎక్కడ నవ్వు తెప్పించే సీన్లు లేకపోవడం పెద్ద మైనస్. ఇటువంటి కథతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే దర్శకుడు కొత్తదనం చూపించడంలో విఫలమయ్యాడు. సీసీటీవీ కెమెరాలో అ వజ్రాల సంచి ఆ అంబానీకి దొరికిందని క్లియర్ గా తెలిసిన రౌడీలు వాడిని పట్టుకోకపోవడం.. శర్మ అండ్ అంబానీ ఏదీ చేసిన వారికే అనుకూలంగా ఉండటం లాంటి కొన్ని లాజిక్ లేని సీన్లు ప్రేక్షకులకి విసుగుతెప్పిస్తాయి. ఇక క్లైమాక్స్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అడల్ట్ సీన్లు ఏమీ లేవు‌. క్లైమాక్స్ లో బ్యాక్ డ్రాప్ చూపిస్తున్నప్పుడు ఒక్క సీన్ లో మాత్రం కాస్త అడల్ట్ సీన్ ఉంటుంది. అది స్కిప్ చేస్తే సరిపోతుంది. సినిమా మొత్తంలో వహ్వా అనిపించే సీన్లు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. సినిమాటోగ్రఫీ పెద్ద మైనస్. గౌతమ్ రాజు ఎడిటింగ్ పర్వాలేదు. శశాంక్ ఆలమూరు మ్యూజిక్ కొంతమేర బాగుంది. నిర్మాణ విలువలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. 

నటీనటుల పనితీరు:

ధన్య బాలకృష్ణ పాత్ర నిడివి కాస్తే అయిన ఆకట్టుకుంది. శర్మగా భరత్ తిప్పిరెడ్డి నటన‌ సినమాకి ప్రధాన బలంగా నిలిచింది. ఇక మిగిలిన వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.

ఫైనల్ గా :  థ్రిల్ ని పంచలేని ఈ శర్మ అండ్ అంబానీ..  కామెడీ లేక ఎంటర్‌టైన్మెంట్ లేకుండా సప్పగా సాగిపోతుంది. ఒక్కసారి కూడా కష్టంగా చూడొచ్చు.

రేటింగ్: 2/5

✍️. దాసరిమల్లేశ్