English | Telugu
డ్రెస్ మార్చుకుంటుంటే డైరెక్టర్ డోర్ తీసాడు..అర్జున్ రెడ్డి భామ సంచలన వ్యాఖ్యలు
Updated : Mar 22, 2025
విజయ్ దేవరకొండ(VIjay Devarakonda)ఫస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమైన భామ షాలిని పాండే(Shalini Pandey)మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టిన షాలిని ప్రస్తుతం హిందీలో బిజీగా ఉంది.రీసెంట్ గా 'డబ్బా కార్టెల్' అనే వెబ్ సిరీస్ లో చేసి తన నటనలో ఉన్న కొత్త కోణాన్ని ప్రేక్షకులకి పరిచయం చేసింది.
'డబ్బాకార్టెల్' ప్రమోషన్స్ లో భాగంగా షాలినీ పాండే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ''కెరీర్ స్టార్టింగ్ లో సౌత్(SOuth)లో ఒక మూవీ చేస్తున్నప్పుడు షాట్ గ్యాప్ లో కారవాన్‌లో నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను.అంతలో ఒక డైరెక్టర్ నా పర్మిషన్ లేకుండానే కారవాన్ డోర్ తీశాడు. కోపంతో నేను కేకలు వేయడం స్టార్ట్ చేయగానే వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోయాడు.ఆ విధంగా కోప్పడటం కరెక్ట్ కాదని చుట్టూ ఉన్న వాళ్లు అన్నారు.నాకు మాత్రం నేను చేసింది తప్పు అనిపించలేదు.ఆ తర్వాత నాకెప్పుడు అటువంటి ఇన్సిడెంట్స్ ఎదురుకాలేదు. ఒకవేళ ఇప్పుడు ఎదురైనా కోప్పడకుండా వారికి ఏవిధంగా జవాబు చెప్పాలో తెలుసుకున్నాను.
ఫేస్‌బుక్‌లో నా ఫొటోలు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా(Sandeepreddy Vanga)కి నచ్చడంతో 'అర్జున్ రెడ్డి' తో హీరోయిన్ గా పరిచయమయ్యా.అప్పట్నుంచి కొనసాగుతున నా జర్నీలో నా అభిప్రాయాలను గౌరవించి దర్శక నిర్మాతలతో పాటు ఆర్టిస్ట్స్ ఎంతో సపోర్ట్‌గా నిలిచారని చెప్పుకొచ్చింది.మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని జబల్పూర్ షాలిని పాండే స్వస్థలం.ఇంజనీరింగ్ చదివిన షాలిని నటనపై ఆసక్తితో మొదట్లో అనేక స్టేజ్ షో లు కూడా చేసింది.