English | Telugu
యన్ టి ఆర్ "శక్తి" విశేషాలు
Updated : Mar 26, 2011
యన్ టి ఆర్ "శక్తి" విశేషాల గురించి ఈ చిత్ర నిర్మాత సి.అశ్వనీదత్ మీడియాకు తెలియజేశారు. ఈ చిత్రం వైజయంతీ మూవీస్ పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, నలకనడుము ఇలియానా హీరోయిన్ గా, ప్రభు, సోనూ సూద్, జాకీ ష్రాఫ్, పూజా బేడీ, మంజరి ఫడ్నీస్ ముఖ్య తారాగణంగా, మెహేర్ రమేష్ దర్శకత్వంలో, చలసాని అశ్వనీదత్ నిర్మించిన భారీ చిత్రం "శక్తి".
ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రానికి 45 కోట్ల రుపాయల భారీ బడ్జెట్ ఖర్చయ్యిందట. పద్దెనిమిది నెలల దీర్ఘకాలంపాటు ఈ చిత్ర నిర్మాణం కొనసాగింది. ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రానికి మూడు వందల మంది యునిట్ సభ్యులు రాత్రనక, పగలనక కష్టపడి పనిచేశారట. గతంలో ఇదే బ్యానర్ లో నిర్మించిన చూడాలని ఉంది చిత్రంలో కలకత్తా నగరాన్ని చూపిస్తే, ఇంద్ర చిత్రంలో కాశీ పట్టణాన్ని చూపించారు.
ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రంలో అష్టాదశ శక్తి పీఠాల గురించి చూపించామని ఈచిత్ర నిర్మాత అశ్వనీదత్ మీడియాకు తెలియజేశారు. ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రంలో హీరో యన్ టి ఆర్ ప్రతి డైలాగ్ కీ జనం క్లాప్స్ కొడతారనీ, ఒక్కో ఫ్రేమ్ లో పెద్దాయన్ని ఈ జూనియర్ యన్ టి ఆర్ గుర్తుకు తెస్తాడనీ, ఇలియానా అందాలు, మణిశర్మ సంగీతం, ఫొటోగ్రఫీ, మెహెర్ రమేష్ దర్శకత్వం ఈ చిత్రాన్ని సూపర్ డూపర్ హిట్ చేస్తాయనీ నిర్మాత అశ్వనీదత్ చాలా విశ్వాసంతో ఉన్నారు. ఈ యన్ టి ఆర్ "శక్తి"చిత్రం గురించి అందరూ మంచి రివ్యూలు వ్రాస్తారని కూడా ఆయన ఆశాభావంతో ఉన్నారు. ఏప్రెల్ ఒకటవ తేదీన ఆల్ ఫూల్స్ డే రోజున విడుదల కానుంది.