Read more!

English | Telugu

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో రివ్యూ

పవన్ సినిమా అంటే జనాల్లో క్రేజే వేరబ్బా..పొగుడుకోవడానికి ఫ్యాన్సు, తిట్టుకోవడానికి యాంటీ ఫ్యాన్సు. ఎవరు ఏ కేటగిరీ ఐతేనేం, మొత్తమ్మీద పవన్ ను నెగ్లెక్ట్ అయితే చేయలేరు ఎవరైనా. మరి అలాంటి సర్దారోడి పాటలు రిలీజైతే, మార్కెట్ ఊరికే ఉంటుందా. ఎక్కడ చూసినా, అవే పాటలతో ఊగిపోతున్నారు జనాలు. మామూలుగానే దేవిశ్రీ పాటలు ఫస్ట్ డే పిచ్చి పిచ్చిగా ఎక్కేస్తాయి. మరి సర్దార్ కు డిఎస్పీ ఎలాంటి పాటలు ఇచ్చాడు..? ఆడియో ఎలా ఉంది..? చూద్దాం రండి..

సర్దార్ టైటిల్ సాంగ్

సర్దార్ గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ ట్రాక్ ఇది. సేమ్ గబ్బర్ సింగ్..గబ్బర్ సింగ్ ట్యూనే. కానీ అంతకు మించిన స్పీడు, ఎనర్జీ సాంగ్ లో కనిపిస్తాయి. రతన్ పూర్ స్టోరీ కావడం వల్ల కావచ్చు, కాస్త హిందీ లైన్లు ఎక్కువ వినిపిస్తుంటాయి. రామజోగయ్య శాస్త్రి యాజ్ ఇటీజ్ గా మంచి క్యాచీ లైన్స్ ఇచ్చాడు. గబ్బర్ సింగ్ టైటిల్ ట్రాక్ కూడా శాస్త్రిగారే రాశారు. మొత్తం సాంగ్స్ లో రాబోయే కాలంలో, కాస్త ఎక్కువగా వినబడబోయే సాంగ్ ఇదే అని ఖచ్చితంగా చెప్పచ్చు. ముఖ్యంగా ఆటోల్లో, డిజేల్లో బాగా క్లిక్ అవుతుంది.

ఓ పిల్లా సుభానల్లా..

మాంచి రొమాంటిక్ సాంగ్ ఇది. శ్రేయా ఘోషల్, దేవి కాంబినేషన్ సాంగ్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఇది కూడా అదే రేంజ్ మెలోడీగా అనిపిస్తుంటుంది. పవన్, కాజల్ మధ్య వచ్చే సాంగ్ కావచ్చు.

తోబా తోబా..

ఐటెం సాంగ్ కొట్టాలంటే, ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్లలో దేవీ మాత్రమే గుర్తొస్తాడు. లెక్కలేనని మాస్ మసాలా హిట్స్ ఇచ్చిన దేవీ, తోబా తోబా అంటూ నాకాష్ అజీజ్, మానసి లతో పాడించిన ఈ ఐటెం నెంబర్ మాంచి ఊపున్న సాంగ్. ఈ పాటలో పవన్ సరసన్ లక్ష్మీరాయ్ చిందేస్తుంది.

ఆడెవడన్నా..ఈడెవడన్నా..

చాలా హడావిడిగా, స్పీడుగా సాగిపోయే లిరిక్స్ తో ఉంటుందీ బిట్ సాంగ్. దీపక్ ఆలపించిన ఈ సాంగ్ కూడా మాస్ జనాలను ఊర్రూతలూగిస్తుంది. బహుశా రౌడీలను పవన్ ఒక రౌండ్ వేసుకునే టైంలో బ్యాగ్రౌండ్ గా ఈ సాంగ్ ను ఉపయోగించచ్చు.

నీ చేపకళ్లు..

మాస్ వినీ అలిసిపోయామనుకునే టైం లో దేవీ తమ్ముడు సాగర్, చిన్మయి పాడిన ఈ సాంగ్ మెలోడీ లవర్స్ కు సూపర్ గా నచ్చేస్తుంది. మెలోడీలు కేవలం రెండే ఉన్న ఆల్బమ్ లో, దేవీ మంచి ట్యూన్ ఇచ్చాడు.

ఖాకీ చొక్కా

సింగర్ సింహా హైపిచ్ లో ఏస్కున్న మాస్ నెంబర్ ఈ పాట. ఇప్పటికే ఆడియోలో మూడు మాస్ నెంబర్లు పడ్డాయి. ఇది నాలుగో ఊరమాస్ సాంగ్. సింపుల్ గా చెప్పాలంటే, పూర్తిగా మాస్ ను టార్గెట్ చేసేశాడు దేవీ.ఇదే ఆల్బమ్ లో లాస్ట్ సాంగ్..

సర్దార్ ఆల్బమ్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే, ఊర మాస్ ఆల్బమ్. రెండు మెలోడీలు, నాలుగు మాస్ ట్యూన్స్ తో దేవీ గబ్బర్ సింగ్ రేంజ్ ఆల్బమ్ నే ఇచ్చాడు. ఇంకొన్నాళ్ల పాటు, ఎక్కడ చూసినా, ఇవే పాటలు వినిపిస్తాయనడంలో మాత్రం డౌట్ లేదు.