Read more!

English | Telugu

వర్మ పవన్ ట్రైలర్ ను తిట్టాడా..పొగిడాడా..?

మెగా ఫ్యామిలీలో ఏం జరిగినా, వెంటనే అందరి కళ్లూ వర్మ ట్విట్టర్ వైపే తిరుగుతాయి. ఎందుకంటే మనోడు వెంటనే ఏదొక ఇంట్రస్టింగ్ ట్వీట్ చేస్తుంటాడు. దానికి అర్ధం ఉందో లేదో అని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించే ప్రయత్నం చేస్తారు తెలుగు సినీ జనాలు. వర్మ తన సినిమాలే కాదు, ట్వీట్లు కూడా చాలా విభిన్నంగా, వైవిధ్యంగా, అర్ధం చేసుకోవడానికి వీలైనంత కష్టంగా ఉండేలా చూసుకుంటాడు. లేటెస్ట్ గా సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ జరిగింది. అసలేమీ జరక్కుండానే పవన్ గురించి ట్వీట్ చేసే వర్మ, ఆడియో ఫంక్షన్ జరిగితే సైలెంట్ గా ఉంటాడా..? ఉండడు గాక ఉండడు. అందుకే తన మార్క్ ట్వీట్లతో, ప్రజలకు పిచ్చెక్కించే ప్రయత్నం చేశాడు.

మెగా స్టార్ స్పీచ్ లో ఒరిజినాలిటీ లేదట. పవర్ స్టార్ స్పీచ్ లో మాత్రం ఉందట. ఒక నెగటివ్ ఒక పాజిటివ్ ట్విట్ తో, ఫ్యాన్స్ తో ఇబ్బంది లేకుండా మ్యానేజ్ చేసుకొచ్చాడు వర్మాజీ. ‘‘పవన్ స్పీచ్ మెగా ఒరిజినల్.. మెగా స్పీచ్ పవర్ ఫుల్లీ అన్ ఒరిజినల్. కానీ అన్నదమ్ముల అనుబంధం మాత్రం మెగా పవర్ ఫుల్ గా వర్కవుటైంది’’ అని ట్వీటాడు. సర్దార్ ట్రైలర్ గురించి కూడా గురువుగారు స్పందించారు. ‘‘ సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్ బెస్ట్ కంటే బ్యాడ్ గా ఉంది. ఫెంటాస్టిక్ కంటే వరస్ట్ గా ఉంది.. అసాధారణ సాధారణంగా ఉంది.. ఐతే ఇంటెంట్ పరంగా ట్రెమండస్. జై పీకే ’’ అన్నాడు. అంటే ట్రైలర్ బాగాలేదంటున్నాడా..? బాగుందంటున్నాడా.? అసలేమంటున్నాడు..వర్మను తిట్టాలా పొగడాలా అనే మీమాంసలో ఫ్యాన్స్ ను పడేశాడు. వర్మా..మజాకా..