రాజాసాబ్ హిట్, ప్లాప్ పై డిస్ట్రిబ్యూటర్ ఆడియో లీక్.. చిరంజీవిని ఎందుకు లాగారు
on Jan 8, 2026

-ఆ ఆడియో రికార్డులో నిజమెంత
-సంచలనం కోసం చేసారా!
-లేక నిజమేనా!
-చిరంజీవిని ఎందుకు ప్రస్తావించారు
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)సంక్రాంతి డైనోసార్ లాగా రేపు 'ది రాజాసాబ్'(The Raja Saab)తో వరల్డ్ వైడ్ గా అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు నుంచే ప్రీమియర్స్ ప్రదర్శిస్తుండటంతో ఫ్యాన్స్ లో, మూవీ లవర్స్ లో సందడి వాతావరణం నెలకొని ఉంది. ఫ్యాన్స్ ఇప్పటికే థియేటర్స్ అన్నింటిని ప్రభాస్ కట్ అవుట్స్ తో నింపేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రాజా సాబ్ రిజల్ట్ కి సంబంధించిన ఆడియో రికార్డింగ్ వాళ్ళల్లో ఎనలేని సంతోషాన్నితెస్తుంది. మరి ఆ ఆడియోలో ఏముందో చూద్దాం.
ఒక డిస్ట్రిబ్యూటర్ ప్రభాస్ అభిమానితో ఫోన్ లో మాట్లాడుతు రాజా సాబ్ చాలా బాగుంది. స్క్రీన్ పై ప్రభాస్ చాలా అందంగా కనిపించాడు, యాక్టింగ్ కూడా చాలా కూల్ గా ఉంది. ప్రభాస్ ఇప్పటి వరకు ఇరవై నాలుగు సినిమాల్లో చేసిన యాక్టింగ్.. ఈ ఒక్క సినిమాలో చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. విపరీతంగా ఎంజాయ్ చేస్తు రిపీట్ గా మూవీ చూస్తారు. చిరంజీవి నటించిన 'దొంగ మొగుడు' సినిమా తరహాలో ఐదు, ఆరు కామెడీ ఎపిసోడ్స్ ఉన్నాయి సెకండాఫ్ లో లాస్ట్ 30 నిమిషాలు మూవీ ఒక రేంజ్ లో అదిరిపోయింది. హాస్పిటల్ సీన్ లో ప్రభాస్ యాక్టింగ్ పీక్స్. సత్య కామెడీ, నాన్నమ్మ పాత్ర, సంజయ్ దత్ పాత్రలు కూడా హైలైట్. హర్రర్ సీన్స్ చాలా కొత్తగా ఉన్నాయి. ఒక రకంగా వాళ్ళు కూడా మూవీలో హీరోలని సదరు డిస్ట్రిబ్యూటర్ ప్రభాస్ అభిమాని చెప్పుకొచ్చాడు.
Also Read: జన నాయగాన్ రిలీజ్ డేట్ వాయిదా.. రేపు కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది
ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రభాస్ ప్యాన్స్ అయితే జై రాజా సాబ్ అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.నెటిజన్స్ లో ఎక్కువ మంది అదంతా ఫేక్ రికార్డు అనే కామెంట్స్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



