Read more!

English | Telugu

సందీప్ కిషన్ కు అదే నచ్చిందట

దీప్ కిషన్ కొత్త సినిమాకు టైటిల్ ఖరారయ్యింది. మిస్టర్ నూకయ్య ఫేం అని కన్నెగంటి డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమాకు మొదట 123, రన్, జిందగీ, నాకూ టైమొచ్చింది, టైం బాబూ టైం అంటూ ఐదు పేర్లు చెప్పి వాటిలో ప్రేక్షకుల్నే ఒక టైటిల్ సూచించమన్నాడు సందీప్ కిషన్. ఎక్కువ మంది రన్ అన్న పేరుకే మొగ్గు చూపడంతో, సినిమాకు రన్ అని టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా ఈరోజు రిలీజైంది. సందీప్ అనీషా అంబ్రోస్ జంటగా రాబోతున్న ఈ మూవీ, తమిళ సూపర్ హిట్ నేరమ్ కి రీమేక్. విచిత్రమైన స్క్రీన్ ప్లే తో నడిచే ఈ మూవీలో గుడ్ టైం, బాడ్ టైం అనేవి ఎలా ఉంటాయో చూపించబోతున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పేరుతో, అజయ్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మార్చి 23న సినిమాను ప్రేక్షకుల ముందుకు వస్తోంది.