Read more!

English | Telugu

నాగార్జున ఊపిరి టీజర్ టాక్

నాగార్జున కార్తీ మల్టీస్టారర్ ఊపిరి టీజర్ ఈరోజు రిలీజైంది. టీజర్ ను ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో కట్ చేశాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఫస్ట్ లుక్ లో చూపించినట్టుగానే, నాగార్జున వీల్ చైర్ కు పరిమితమయ్యే పాత్ర పోషించారు. తమన్నా ఆయన పిఏగా, కార్తి అసిస్టెంట్ గా కనిపించనున్నారు. కార్తీ జైలు నుంచి విడుదలైనట్టు, నాగార్జున రేస్ కార్ నడుపుతున్నట్టు, కొద్దిగా సినిమాపై ఇన్ఫర్ మేషన్ ను చూపించే ప్రయత్నం చేశారు. మాస్ కు క్లాస్ కు కూడా ఇమ్మీడియట్ గా రీచ్ అవుతుంది. రిచ్ లుక్ తో, రిఫ్రెషింగ్ గా టీజర్ కనిపించడం విశేషం. ఫ్రెంచి సినిమా ది ఇన్ టచ్ బుల్స్ కు రీమేక్ గా తీసిన ఊపిరిని పివిపి సినిమా బ్యానర్ ద్విభాషా చిత్రంగా తెరకెక్కించింది.