Read more!

English | Telugu

కేటిఆర్ కి ఒక నమస్కారం.. సమంత పోస్ట్ వైరల్ 

సమంత(samantha) అనే పేరు వింటే చాలు తెలుగు ప్రేక్షకులు తమ సొంత మనిషి అనే విధంగా భావిస్తారు. ఎలాంటి క్యారెక్టర్లో అయినా ఒదిగిపోయి నటించడం ఆమె స్పెషాలిటీ. అందుకే ఆమె తెలుగు నాట అగ్ర కథనాయికిగా కొనసాగుతు వస్తుంది.ఇటీవలే మయోమైటీస్ అనే వ్యాధి నుంచి బయటపడి మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతు వస్తుంది. తాజాగా ఆమె తెలంగాణ మాజీ మంత్రి కేటిఆర్(ktr)కి ఇచ్చిన రిప్లై ఇప్పుడు వైరల్ గా మారింది.

 కేటిఆర్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసాడు. జీవితం మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినా చిరునవ్వుతో ఎదుర్కోవాలి అని.పైగా ఆ పోస్ట్ కి  కొంత మంది జనంతో కలిసి చిరు నవ్వుతో ఉన్న తన పిక్ ని కూడా పెట్టాడు. సమంత ఆ పిక్ కి లైక్ కొట్టడమే కాకుండా నమస్తే ఎమోజి ని  కూడా పెట్టింది. ఇప్పుడు ఇదంతా వైరల్ గా మారింది. నమస్తే కి అర్ధం ఏంటంటూ అందరు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో  సిటాడెల్(citadel) హానీ బన్నీ అనే వెబ్ సిరీస్ లో చేస్తుంది. త్వరలోనే అది విడుదల కాబోతుంది.వరుణ్ ధావన్ హీరోగా చేస్తుండగా రాజ్ అండ్ డికే దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.