Read more!

English | Telugu

ప్రభాస్ వారసుడు గౌడ్ సాబ్ ఎంట్రీ

సినీ వారసులకి తెలుగు తెర కొత్తేమో కానీ తెలుగు తెరకి మాత్రం  కొత్త కాదు. పరిశ్రమ పుట్టినప్పటి నుంచి ఎంతో మంది వారసులు వస్తూనే ఉన్నారు. తాజాగా  మరో నట వారసుడు తెలుగు తెరపై  అడుగుపెట్టబోతున్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్ కజిన్  విరాట్ కృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ప్రముఖ కొరియో గ్రాఫర్  గణేష్ మాస్టర్ ఆ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ రోజు ఇదే  టాక్ అఫ్ ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ

గౌడ్ సాబ్ అనే ఒక పవర్ ఫుల్ టైటిల్ తో మూవీ లాంచింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ హాజరయ్యి  విష్ చేసాడు.ప్రస్తుతానికి అయితే విరాట్ ఒక్కడినే రివీల్ చేసారు. హీరోయిన్ తో పాటు  మిగతా నటినటుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. సినిమా అయితే  పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ అని తెలుస్తుంది. శ్రీ పాద  ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తుండగా వేంగి సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ వార్తతో ఖుషిగా ఉన్నారు.విరాట్ ఎలా నటిస్తాడో అనే క్యూరియాసిటీ వాళ్లలో ఉంది

 ఇక గణేష్ మాస్టర్ తెలుగు సినిమా పరిశ్రమలో దశాబ్డంన్నర క్రితం నుంచే ఉన్నారు.ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లోని పాటలకి కొరియోగ్రాఫ్ ని అందించాడు. ఆయన కంపోజ్ చేసిన పాటలు హీరోలకి మంచి పేరుని కూడా  తెచ్చి పెట్టాయి. గబ్బర్ సింగ్ ,ఆర్య 2 ,దువ్వాడ జగన్నాధం, గోపాల గోపాల లాంటి హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. మరీ దర్శకుడుగా ఏ మేర రాణిస్తాడో చూడాలి.