English | Telugu
సమంతకు స్టార్ హీరో డబ్బుసాయం... గట్టిగా ఇచ్చి పడేసింది!
Updated : Aug 5, 2023
సమంత గతకొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న విష్యం తెలిసిందే.. తాను ఎదుర్కుంటున్న మయోసైటిస్ వ్యాధికి చికిత్స నిమిత్తం అయ్యే ఖర్చు కోసం టాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ హీరో తనకు 25 కోట్లరూపాయలు ఇచ్చాడని సోషల్ మీడియా లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.. ఎంతలా అంటే ఆ వార్త సమంత వరకు రీచ్ అయ్యింది.!
ఐతే సమంత ఈ విష్యం మీద స్పందిస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది.. తాను చికిత్స తీసుకుంటున్న మాయోసైటిస్ కి అంత పెద్దమొత్తంలో ఖర్చుకాలేదు అని.. ఏ స్టార్ హీరో దగ్గర నేను డబ్బు తీసుకోలేదని చెప్పుకొచ్చింది.. సినిమాలు చేస్తూ దేవుడి దయతో బాగానే సంపాదించా అని.. ఐనా మాయోసైటిస్ వ్యాధి తో చాలామంది బాధపడుతున్నారు.. ఈ లాంటి వార్తలు పుట్టించి వాళ్ళని భయబ్రాంతులకు గురి చేయొద్దు అని తెలియచేసింది... ప్రస్తుతం సమంత చేస్తున్న సినిమాలను కంప్లీట్ చేసి.. పూర్తి సమయం తన ఆరోగ్యం మీద.. మెంటల్ గా , ఫిసికల్ గా స్ట్రాంగ్ అయ్యేందుకు కేటాయిస్తుంది.!