English | Telugu

రాబిన్ విలియమ్స్ సూసైడ్..సమంత దిగ్భ్రాంతి

హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత రాబిన్ విలియమ్స్ (63) బలవన్మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాబిన్ విలియమ్స్ ఆకస్మిక మరణానికి చింతిస్తూ పలువురు సెలబ్రెటీలు ట్విట్టర్‌ ద్వారా తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. ఈ విషయంపై సమంత స్పందిస్తూ.. ఈ విష‌యం తెలియ‌గానే దిగ్భ్రాంతికి గురయ్యా. ఆ క్షణం నుంచి ఆయ‌న గురించే ఆలోచిస్తున్నా. రాబిన్స్ న‌ట‌న‌ని ఎంత ఇష్టపడ్డానో ఇప్పుడే తెలుస్తోంది. మనకు ఎన్ని సమస్యలు ఎదురైనా ఎదుర్కొని నిల‌బ‌డాలి. రేప‌టి రోజు ఎలా ఉంటుందో ఎవ‌రు చెప్పగలరు? అని ట్విట్టర్‌ లో రాసింది స‌మంత‌.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.