English | Telugu

సూరీడే గొడుగు పట్టి వచ్చాడు.. సలార్ ఫస్ట్ సింగిల్ అదిరింది!

సలార్ సినిమా కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం 'సీజ్ ఫైర్' డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు మేకర్స్.

'సలార్' నుంచి 'సూరీడే' అనే మొదటి పాట బుధవారం సాయంత్రం విడుదలైంది. శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథగా ఈ సినిమా రూపొందుతోందని గతంలో దర్శకుడు చెప్పాడు. అందుకు తగ్గట్టుగానే తాజాగా విడుదలైన 'సూరీడే' పాట స్నేహం నేపథ్యంలో సాగింది. "సూరీడే గొడుగు పట్టి, వచ్చాడే భుజం తట్టి" అంటూ ప్రారంభమైన ఈ పాట ఆకట్టుకుంటోంది. రవి బస్రూర్ స్వరపరిచిన ఈ పాటకు కృష్ణ కాంత్ సాహిత్యం అందించగా, హరిణి ఆలపించారు. లిరికల్ వీడియోలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రల మధ్య ఉన్న స్నేహాన్ని చూపించారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.