English | Telugu

ఆర్మీ మేజర్ భార్యని కలిసింది నిజమే..ఆమె ద్వారానే నటన నేర్చుకున్నాను

ఫిదా(fida)మూవీతో తెలుగుప్రేక్షకుల అభిమాన కధానాయకిగా మారిన నటి సాయిపల్లవి(sai pallavi)ఆ తర్వాత ఎంసీఏ, శ్యాంసింగరాయ్, విరాటపర్వం, లవ్ స్టోరీ వంటి  సినిమాలతో అగ్ర కధానాయకిగా కూడా మారిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో తండేల్,రామాయణం తో పాటు ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ ముకుంద్ వరద రాజన్ జీవిత కథ ఆధారంగా తమిళంలో తెరకెక్కుతున్న అమరన్ వంటి పలు బడా సినిమాలు ఉన్నాయి

రీసెంట్ గా అమరన్ చిత్రబృందం సాయి పల్లవి క్యారక్టర్ ని పరిచయం చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది.ఈ సందర్భంగా  ఇచ్చిన ఇంటర్వ్యూ లో సాయి పల్లవి మాట్లాడుతు నేను ఇప్పటికి వరకు బయోపిక్ లో నటించలేదు.వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అందుకు తగ్గట్టుగా క్యారక్టర్ ని అర్ధం చేసుకొని దానికి అనుగుణంగా వర్క్  చేసుకుంటూ వస్తున్నాను.ఎప్పుడు కూడా భావోద్వేగాలకి న్యాయం చేయాలనీ అనుకునేదానిని. అమరన్ లో అవకాశం వచ్చాక ఆ రోల్ కి పూర్తి న్యాయం చేయాలనుకున్నాను. అందుకోసం ముకుంద సతీమణి ఇందుకా రెబెకా ని కలిసి ఆమెతో ఎన్నో విషయాల గురించి చర్చించి క్యారక్టర్ కి సంబంధించిన అవగాహనని పొందానని తెలిపింది.

ఇక  మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో చూస్తుంటే సాయి పల్లవి మరోసారి తన పెర్ఫార్మెన్సు తో మెస్మరైజ్ చేయబోతుందనే  విషయం అర్ధమవుతుంది. టైటిల్ రోల్ ని తమిళ టాప్ హీరో  శివ కార్తికేయన్(sivakarthikeyan)పోషిస్తుండగా రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్(kamal haasan)నిర్మించడం విశేషం. ఆక్టోబర్ 31 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుండగా తెలుగులో హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, అక్క నిఖితా రెడ్డి లు విడుదల చేస్తున్నారు. శివ అరూర్, రాహుల్ సింగ్ రాసిన 'ఇండియాస్ మోస్ట్ ఫియర్ లెస్' అనే పుస్తకంలోని  మేజర్ ముకుంద్ వరద రాజన్  గురించి రాసిన కథ ఆధారంగానే అమరన్ ని   తెరకెక్కించగా రాజ్ కుమార్ పెరియ స్వామి దర్శకత్వాన్ని వహించాడు.