English | Telugu

అతనిపై యాక్షన్‌ తీసుకుంటా.. రుక్మిణీ వసంత్‌ వార్నింగ్‌!

- అతన్ని ఊరికే వదిలిపెట్టను

- నా వాయిస్‌తో మాట్లాడుతున్నాడు

- నా పేరుతో మోసాలు జరుగుతున్నాయి

సౌత్‌లోని వివిధ భాషల్లో హీరోయిన్‌గా నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న రుక్మిణీ వసంత్‌.. తాజాగా ఎక్స్‌లో పెట్టిన ఒక పోస్ట్‌ ఇప్పుడు సంచలనంగా మారింది. తన పేరును వాడుకుండా మోసాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ.. అతన్ని ఊరికే వదిలిపెట్టనని, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అతనికి వార్నింగ్‌ ఇచ్చింది. అతనెవరు, ఎందుకా పోస్ట్‌ పెట్టిందనేది అర్థం కాక నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

సోషల్‌ మీడియా ద్వారా నెటిజన్లను, అభిమానులను ఒక పోస్ట్‌ ద్వారా హెచ్చరించింది రుక్మిణి. ‘నా వాయిస్‌తోనే మాట్లాడుతూ ఒక వ్యక్తి కొందరికి కాల్‌ చేసి మాట్లాడినట్టు నాకు తెలిసింది. అలాంటి కాల్స్‌ వస్తే ఎవరూ స్పందించవద్దు. వేరొకరి గొంతుతో మాట్లాడుతూ మోసాలకు పాల్పడడం సైబర్‌ క్రైమ్‌ కిందకి వస్తుంది. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై యాక్షన్‌ తీసుకుంటాను. ఇలాంటి కాల్స్‌ ఎవరికైనా వస్తే.. నేరుగా నన్ను లేదా నా టీమ్‌ని సంప్రదించవచ్చు. ఈ తరహా మోసాలకు చాలా మంది పాల్పడుతున్నారు. సోషల్‌ మీడియాలో మీరంతా జాగ్రత్తగా ఉండాలి’ అంటూ హెచ్చరించింది రుక్మిణీ వసంత్‌.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం