English | Telugu
ఇంకా ఎవరికీ కమిట్ అవ్వలేదంట
Updated : Feb 20, 2014
నవీన్ చంద్ర, రీతూవర్మ కలిసి నటించిన "నా రాకుమారుడు" చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా రీతూ మాట్లాడుతూ..."బాద్ షా" లో కాజల్ చెల్లెలిగా నటించాను. ఆ తర్వాత "ప్రేమ ఇష్క్ కాదల్" సినిమాలో నటించిన నా పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం నేను నటించిన "నా రాకుమారుడు" చిత్రం నాకు మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను. అందుకే ఈ సినిమా విడుదలయ్యే వరకు కొత్త సినిమాలేవీ కమిట్ కావడం లేదు. దర్శకుడు సత్య నా పాత్రను బాగా డిజైన్ చేసాడు" అని అన్నారు.