English | Telugu

రిషబ్ శెట్టి మరో సంచలనం.. చరిత్ర సృష్టించడానికి సిద్ధం...

'కాంతార' సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి. ప్రస్తుతం 'కాంతార-2'తో బిజీగా ఉన్న రిషబ్.. వరుస భారీ చిత్రాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే తెలుగులో 'జై హనుమాన్', హిందీలో 'ఛత్రపతి శివాజీ మహారాజ్' చిత్రాలను ప్రకటించాడు. తాజాగా తెలుగులో మరో భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. (Rishab Shetty)

రిషబ్ తన రెండవ తెలుగు సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'ఆకాశవాణి' మూవీ ఫేమ్ అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఫిక్షనల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుంది. 18వ శతాబ్దంలో భారత్‌లోని అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్‌లో ఒక తిరుగుబాటుదారుడు ఎదిగిన క్రమం నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుందని మూవీ టీమ్ తెలిపింది.

రిషబ్ శెట్టి వరుసగా డివోషనల్, హిస్టారికల్ సినిమాలు చేస్తుండటం విశేషం. డివోషనల్ టచ్ ఉన్న 'కాంతార'తో సంచలనం సృష్టించిన రిషబ్.. అదే బాటలో 'కాంతార-2', 'జై హనుమాన్' చేస్తున్నాడు. అలాగే 'ఛత్రపతి శివాజీ మహారాజ్' హిస్టారికల్ ఫిల్మ్ కాగా.. ఇక ఇప్పుడు సితార బ్యానర్ లో మరో హిస్టారికల్ ఫిల్మ్ కి రెడీ అయ్యాడు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.