Read more!

English | Telugu

అర్జెంట్ గా ఈ సినిమా చూడండి..రేణుదేశాయ్ బిజెపి ఫాలోవరా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు ఈ విశ్వంలో మారుమోగిపోతున్నంత కాలం రేణు దేశాయ్ పేరు వినపడుతునే ఉంటుంది. పవన్ మాజీ వైఫ్ గా ఆమెకి ఆ క్రేజ్ ఉంది. సోషల్ మీడియా లో ఫుల్ ఆక్టివ్ గా ఉండే ఆమె  తాజాగా ఒక పోస్ట్ చేసింది. పలానా సినిమా చూడండి అని. ఇంతకీ ఆమె చెప్తున్న మూవీ ఏంటో తను ఎందుకు అలా చెప్తుందో చూద్దాం 

ఆర్టికల్ 370 ..యామిని గౌతమ్,ప్రియమణి,రాజ్ అర్జున్  ప్రధాన పాత్రలని పోషించిన ఈ మూవీ మొన్న ఫిబ్రవరి 23, 2024 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి హిట్ టాక్ ని తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగా చూసుకున్నా కూడా  మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పుడు ఓటిటి వేదికగా నెట్ ఫ్లిక్స్ లో కూడా ప్రేక్షకులని అలరిస్తుంది. ఇప్పుడు ఈ మూవీని చూడమనే రేణు దేశాయ్ చెప్తుంది. ఇప్పుడే ఈ చిత్రాన్ని చూసాను. దీన్ని చిత్రీకరించిన అద్భుతమైన విధానం మరియు మన దేశంలోని అద్భుతమైన నటులు మరియు వాస్తవికత కోసం ప్రతి ఒక్కరు  చూడాలని తన ట్వీట్ లో పేర్కొంది

 

 ఇప్పుడు ఈ ట్వీట్ ని చూసిన చాలా మంది  ఎలక్షన్స్  టైం లో ఇలాంటి సినిమాలు చూడటం అవసరం అంటు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవాన్ని చూసుకుంటే ఆర్టికల్ 370  లో ప్రధాన మంత్రి మోడీ గొప్పతనం  చాలా స్పష్టంగా కనపడుతుంది. 2019 లో ఫిబ్రవరి 14 వ తేదీన పుల్వామా దాడి జరిగింది. ఆ తర్వాత  జమ్ము కాశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ ను కల్పించే  అంశంలో భాగంగా  ఆర్టికల్ 370 ను రద్దు జరుగుతుంది. ఆ సమయంలో మోడీ ఎంత తెలివిగా వ్యహరించారనేదే ప్రధాన అంశం. కొన్ని రోజుల క్రితం కూడా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి  బిజెపి ఎంపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవిలతని పొగుడుతూ ట్వీట్ చేసింది. ఆర్టికల్ 370  జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మాణం జరుపుకుంది.  ఆదిత్య సుహస్ జంభ  దర్శకుడు