Read more!

English | Telugu

ఆ నెత్తురు  విజయ్ దేవరకొండ దే.. రాయలసీమ అని చెప్తున్నాడా!

 

విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు  పంతొమ్మిది సినిమాలు చేసాడు.అందులో పక్కా హీరోగా చేసిన చిత్రాలు పన్నెండు.  హిట్ అయిన సినిమాలు పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం,టాక్సీ వాలా  లేటెస్ట్ గా ఫ్యామిలీ స్టార్ తో   డిజాస్టర్ ని అందుకున్నాడు.  దీంతో ఇప్పుడు తనకి  అర్జెంట్ గా  ఒక హిట్ కావాలి. ఈ నేపథ్యంలో వస్తున్న  రెండు వార్తలు విజయ్ ఫ్యాన్స్ లో పండగ వాతావరణాన్ని తెస్తున్నాయి. పైగా ఈ సారి హిట్ ఖాయమని కూడా అంటున్నారు 

విజయ్ ప్రస్తుతం జెర్సీ ఫేమ్  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ఏ మూవీ చేస్తాడు అనుకునే తరుణంలో రాజా వారు రాణి వారు ఫేమ్  రవి కిరణ్ కోల మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దిల్ రాజు దీనికి నిర్మాత. ఈ మేరకు తాజాగా  ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఒక చేయి  ఒక పెద్ద కొడవలని పట్టుకొని ఉంది. విజయ్ లుక్ ని మాత్రం రిలీజ్ చెయ్యలేదు. ఆ చేయి విజయ్ దే అని అనుకోండి. అలాగే పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతుందనే సింబాలిక్ గా తెలుగు,హిందీ, తమిళ, మలయాళ,కన్నడ భాషల్లో కత్తి నేనే, నెత్తురు నాదే,యుద్ధం నాతోనే అనే క్యాప్షన్ ని కూడా యాడ్ చేసారు. ఇప్పుడు ఈ పోస్టర్ ని చూసిన విజయ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు

ఇప్పుడు వాళ్లకి డబుల్ ఆనందాన్ని కలిగించేలా ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ  తమ కొత్త చిత్రాన్ని రేపు ప్రకటిస్తామని ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది.  మద్రాస్ రెసిడెన్సీ కి చెందిన మ్యాప్ లో రాయలసీమ ప్రాంతాన్ని చూపించారు. ఈ పోస్టర్ కూడా ఎంతో క్యూరియాసిటీ ని కలిగిస్తుంది. ఇది కూడా  విజయ్ దేవరకొండ కొత్త మూవీనే.  టాక్సీవాలా ని  డైరెక్ట్ చేసిన రాహుల్ సంకృత్యాన్‌ దానికి దర్శకుడు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే పీరియాడికల్ ఫిల్మ్‌గా  తెరకెక్కుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా అధికార ప్రకటన రానుంది. ఇక ఆశ్చర్య కరమైన విషయం ఏంటంటే విజయ్ గత చిత్రాలైన  ఖుషి ,ఫ్యామిలీ మెన్  లు వరుసగా విడుదల అయ్యాయి. ఒక మూవీని మైత్రి నిర్మించగా ఇంకో దాన్ని  దిల్ రాజు నిర్మించాడు. ఆ రెండు  డిజాస్టర్స్ గా నిలిచాయి. మళ్ళీ వాళ్లిద్దరే వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. మరి ఆ రెండిటిలో ఏది త్వరగా కంప్లీట్ అయ్యి రిలీజ్ అవుతుందో చూడాలి