English | Telugu
ఆయనకి కేరింగ్ ఎక్కువ... పూజాహెగ్డే నవ్వంటే పిచ్చి!
Updated : May 9, 2023
విరూపాక్ష మూవీ హారర్ అండ్ థ్రిల్లర్ మూవీగా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుని మంచి వసూళ్లను కూడా రాబట్టింది. ఈ చిత్రంలో అందరి పాత్రలు ఒకెత్తు, రవికృష్ణ పాత్ర ఒకెత్తు. బుల్లితెరకు బ్రేక్ ఇచ్చి వచ్చినందుకు మంచి సక్సెస్ ని అందుకున్నాను అంటున్నాడు రవికృష్ణ ఒక ఇంటర్వ్యూలో. "విరూపాక్ష 2 ఉంటుందని కార్తీక్ బ్రో మైండ్ లో ఉంది కానీ అది ఇంకా పేపర్ మీదకు రాలేదు. ఇక అందులో నా రోల్ గురించి ఏమీ చెప్పలేదు చెప్తే మాత్రం చేస్తా...ఇక సాయి ధరమ్ తేజ్ అన్న చాలా స్వీట్ హార్ట్. ఎవరినైనా సమానంగా ట్రీట్ చేస్తారు. ఎవరితోనైనా మాట్లాడతారు. ఆయన చాలా డౌన్ టు ఎర్త్. మెగా ఫామిలీ అనే థాట్ కూడా మాకు రాదు. నేను కొత్త కదా ఇండస్ట్రీకి అని ప్రెస్ మీట్స్ లో వాటిల్లో దూరంగా నిల్చుంటే వెంటనే అన్న నన్ను స్టేజి మీదకు పిలుస్తారు. నాకు ఇండస్ట్రీకి వచ్చాక ఫస్ట్ క్రష్ ఎవరంటే పూజ హెగ్డే. ఆమె నవ్వు చాలా చిన్నపిల్లలా ఉంటుంది.
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఫ్రెండ్స్ అంత టచ్ లో ఉన్నారు. స్మార్ట్ విలన్ క్యారెక్టర్ లో నేను చేయాల్సి వస్తే ఎన్టీఆర్, అల్లు అర్జున్ మూవీస్ కి డేట్స్ సెట్ చేసుకుని యాక్ట్ చేస్తాను. డిగ్రీ పూర్తయ్యాక ఫస్ట్ చెన్నై వెళ్ళిపోయాను. తర్వాత అక్కడి నుంచి ఇంటికి పేషెంట్ లా వచ్చేసరికి ఇంట్లో నాన్న బాధపడి హైదరాబాద్ లో ఉన్న మా అత్తా వాళ్ళ ఇంటికి పంపించేశారు. అప్పుడు మా అత్త బాగా ఫుడ్ పెట్టేది. మా మావయ్య డబ్బులు ఇచ్చేవారు. అందుకే నాకు ఎలాంటి సమస్యా లేదు. నాకు మందు, సిగరెట్, పబ్ కల్చర్ అసలు నచ్చవు...మా ఇంట్లో నేనెప్పుడూ ఆ వాతావరణం చూడలేదు. నాకు నా రోల్ బాగా చేశారు అంటే చాలు..చాలా హ్యాపీగా ఉంటాను". అని చెప్పాడు.