English | Telugu
ప్రమాదం నుంచి కోలుకుంటున్నా.. వైరల్ అవుతున్న రష్మిక మందన్న పోస్ట్!
Updated : Sep 9, 2024
రష్మిక మందన్నకు యూత్‌లో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పుష్ప, యానిమల్ చిత్రాలతో నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఫ్యాన్స్‌తో ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ తన ఆనందాలను వ్యక్తం చేస్తుంటుంది. అయితే ఈమధ్య సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా లేదు. చాలా కాలం తర్వాత ఓ పోస్ట్‌తో మళ్లీ వచ్చింది రష్మిక. తన తాజా పోస్ట్‌లో ఏం షేర్ చేసిందో చూద్దాం.
‘హాయ్ గైస్.. అంతా బాగున్నారా.. మిమ్మల్ని కలిసి చాలా కాలమైంది. గత నెలలో నేను పెద్ద యాక్టివ్‌గా లేనన్న విషయం మీకు కూడా తెలుసు. దానికి కో కారణం ఉంది. అదేమిటంటే.. నాకు చిన్న ప్రమాదం జరిగింది. మైనర్ యాక్సిడెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. డాక్లర్ల సలహా మేరకు ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాను. అంతేకాదు, యాక్టివ్‌గా కూడా ఉన్నాను. నా యాక్టివిటీస్ వరకు నేను చూసుకోగలుగుతున్నాను. మీరు కూడా మిమ్మల్ని మీరు ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది రేపు అనేది మనకు ఉందో లేదో తెలీదు కాబట్టి ప్రతిరోజూ ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి.. నా గురించి మీకు మరో విషయం చెప్పాలి. ఇప్పుడు నేను లెక్కలేనన్ని లడ్డూలు తింటున్నాను’ అంటూ ఓ ఫన్నీ స్టిల్‌ని పోస్ట్ చేసింది. తమ లవ్‌లీ హీరోయిన్‌కి జరిగిన ప్రమాదంపై స్పందిస్తున్న అభిమానులు రష్మిక పెట్టిన పోస్ట్‌ను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.