English | Telugu

అల్లు అర్జున్ తో రాశీ గుసగుసలు..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ లవ్ స్టొరీని డైరెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో ముగ్గురు హీరోయిన్లతో బన్నీ రొమాన్స్ చేయనున్నాడు. ఇప్పటికే సమంతను లీడ్ హీరోయిన్ గా ఆదాశ‌ర్మ ను మరో హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక మూడో క‌థానాయిక పాత్ర కోసం ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో ఆక‌ట్టుకొన్న క‌థానాయిక రాశీఖ‌న్నా ను తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదట ప్రణీత ను ఈ పాత్ర కోసం తీసుకోగా ఆఖరి నిమిషంలో త్రివిక్రమ్ రాశీఖ‌న్నాను ఓకే చేసినట్లు సమాచారం. ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంలో తన క్యూట్ లుక్స్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మైతే బన్నీ సరసన బాగుటుందని భావించారట.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.