Read more!

English | Telugu

యన్ టి ఆర్ రాముడు-భీముడు 2012

యన్ టి ఆర్ "రాముడు-భీముడు 2012" సినిమా త్వరలో నిర్మించనున్నట్లు ఫిలిం నగర్ వర్గాల కథనం. వివరాల్లోకి వెళితే గతంలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను తొలిసారిగా ప్రారంభించిన దగ్గుబాటి రామానాయుడు తన సంస్థలో నిర్మించిన తొలి చిత్రం, సూపర్ హిట్ చిత్రం "రాముడు-భీముడు". "రాముడు-భీముడు" చిత్రంలో విశ్వవిఖ్యాత నవరస నటనాసార్వభౌమ, నటరత్న, డాక్టర్ నందమూరి తారక రామారావు ద్విపాత్రాభినయం చేశారు.

ప్రస్తుతం "రాముడు-భీముడు" చిత్రాన్ని యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, "రాముడు-భీముడు 2012" పేరుతో పునర్నిర్మించాలని మూవీ మొగల్ డాక్టర్ డి.రామానాయుడు సన్నాహాలు చేస్తున్నారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. యన్ టి ఆర్ "రాముడు-భీముడు 2012" అన్న పేరులోనే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమై, ఎప్పుడు విడుదలవుతుందో మనకర్థమవుతుంది. యన్ టి ఆర్ "రాముడు-భీముడు 2012" సినిమా తీస్తే ఓక సినిమాని తాతతోనూ, మనవడితోనూ నిర్మించి మరోసారి రామానాయుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కే అవకాశముంది. అవునా...?కాదా...? దీనిపై మీ స్పందనేమిటి...?