English | Telugu

మహేష్ పై తారక్ సెటైర్ వేసినట్లేనా

మహేష్ నటించిన "దూకుడు" చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రంలో "యమదొంగ" సినిమాలోని ఎన్టీఆర్ చెప్పిన పులి డైలాగ్ ను ఎమ్మెస్ నారాయణ చేత చెప్పించి, "దూకుడు" చిత్ర విజయంలో ఒక కారణం అయ్యింది. అయితే తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం "రామయ్యా వస్తావయ్యా". ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కామెడి సీన్స్ ట్రైలర్స్ రీలిజ్ అయ్యాయి. ఇందులో ఎన్టీఆర్ మహేష్ పై చిన్న సెటైర్ వేసాడు. ఈ సీన్ లో "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.... రేపేమో వాళ్ళింట్లో నువ్ కాలు పెట్టు" అని మహేష్ సినిమాను కామెడీగా వాడుకున్నాడని అందరూ అనుకుంటున్నారు.

ఈ విధంగా ఈ ఇద్దరు పెద్ద హీరోలు ఒకరి సినిమాలో మరొకరు కావాలని సెటైర్లు వేసుకోకపోయినా కూడా అభిమానుల్లో మాత్రం మహేష్-తారక్ ల మధ్య గట్టి పోటియే ఉందని అనుకుంటున్నారు. మరి ఎన్‌టిఆర్ హీరోగా నటించిన "రామయ్యా వస్తావయ్యా" చిత్రం అక్టోబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.తమన్ అందించిన పాటలు ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ తనదైన శైలిలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో తారక్ సరసన సమంత, శృతిహాసన్ హీరోయిన్లుగా నటించారు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.