Read more!

English | Telugu

రామ్, సమంత జంటగా గౌతమ్ మీనన్ మూవీ

రామ్, సమంత జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక మూవీ రానుందని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, యువ హీరో రామ్ హీరోగా, అందాల సమంత హీరోయిన్ గా, "ఘర్షణ" ఫేం గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఒక చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ అంతర్జాతీయ సంగీత దర్శకులు ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని హీరో రామ్ పెదనాన్న, ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ సమర్పిస్తున్నారట. ఈ చిత్రం యాక్షన్ బేస్డ్ థ్రిల్లర్ గా ఉంటూ లవ్ అండర్ కరెంట్ గా ఉండే ఒక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రమని తెలిసింది.

 

ఇలాంటి సినిమాలు తీయటంలో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ చాలా ఘటికుడని అతని గత చిత్రాలే నిరూపించాయి. అందులోనూ ర్రామ్ వంటి ఎనర్జిటిక్ యువ హీరో దొరికితే అలామటి దర్శకుడు మామూలు సినిమా తీస్తాడా...? బ్లాక్ బస్టర్ తప్ప.